Monday, December 23, 2024

రాంనగర్‌లో హైడ్రా కూల్చివేతలు

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ : హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ప్రాంతం రాంనగర్‌లోని మణెమ్మ కాలనీలో నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైడ్రా అధికారులు జెసిబిలతో మణెమ్మ కాలనీలో చేరుకొని నాలాను ఆక్రమించిన నిర్మాణాలను కూల్చారు. తాజాగా ఓ యువతి పిర్యాదుతో మణెమ్మ బస్తీని రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాంనగర్‌లో పర్యటించి నాలాను ప్రత్యేకంగా పరిశీలించారు. నాలాపై అక్రమ కట్టడాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని జిహెచ్‌ఎంసి, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణాలు అక్రమమే అని తేలడంతో హైడ్రా అధికారులు శుక్రవారం ఉదయం కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News