Sunday, December 22, 2024

దుర్గం చెరువుపై హైడ్రా ఫోకస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దుర్గం చెరువు పరిసరాల్లోని కాలనీలపై హైడ్రా అధికారుల ఫోకస్ పెట్టారు. దుర్గం చెరువు ఎఫ్ టిఎల్ పరిదిలో ఉన్న అమర్ కోఆపరేటివ్ సొసైటీ, డాక్టర్స్ కాలనీ, నెక్టార్ కాలనీ, కావురిహిల్స్ లలో నివాసం ఉంటున్న వారికి హైడ్రా నోటీసులు జారీ చేసింది.  30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. ఎఫ్ టి ఎల్ జోన్ లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఉంది. మాదాపూర్ లోని అమర్ సోసైటీ, కావూరి హిల్స్ కాలనీ వాసులకు హైడ్రా నోటీసు ఇవ్వడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. నోటీసులు ఇచ్చిన ఇండ్లకు ‘ఎఫ్’ అని అధికారులు రాశారు. చెరువు చుట్టూ ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. ఎఫ్ టిఎల్ జోన్ లో  నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News