700 మంది నియామకం 70 చెరువులపై 3 షిప్టులుగా లేక్ ప్రొటెక్షన్
గార్డ్ త్వరలో ఓఆర్‌ఆర్ పరిధిలోని 513 చెరువులపై ఫోకస్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: ఓఆర్‌ఆర్ పరిధిలోని చెరువులు ఆక్రమణలకు గుకాకుండా ఉం డేందకు ప్రత్యేక నిఘాకు హైడ్రా శ్రీకారం చు ట్టింది. ఈ క్రమంలోనే చెరువులకు ప్రత్యేకంగా 700 మంది నిఘా సిబ్బందిని నియమించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తున్నందు న భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో చెరువులను ఆక్రమించడం జరుగుతుందని, దీనిని అరికట్టేందుకు హైడ్రా చర్యలను ఈపాటికే చేపట్టింది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని చెరువుల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను, ఆక్రమణలను తొలగిస్తూ తీవ్రంగా హెచ్చరికలు జారీచేస్తూ వస్తుంది.
చెరువుల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నప్పటికీ.. ఇక ముందు చెరువుల్లోకి ఎలాంటి కబ్జాలు, నిర్మాణాలు రా కుండా ఉండేందుకు నిఘాను పెంచాలని హైడ్రా నిర్ణయించింది. ఇటీవల పోలీసు రిక్రూట్‌మెంట్ లో 1,2,3 మార్కుల తేడాతో పోలీసుగా ఎంపిక య్యే అవకాశం కోల్పోయిన వారిని పిలిచి ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాన్ని కల్పించి, వారితో చెరువులపై నిఘా పెట్టాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నిర్ణయించారు.
700 మంది ఇలా
ఓఆర్‌ఆర్ పరిధిలో దాదాపు 513 చెరువులు ఉన్నట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీటిని పరిరక్షించేందుకుగానూ నిఘా పెట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. మొత్తం 700 మందిని ఎంపిక చేసి.. వీరిని మూడు షిప్ట్‌లుగా విధుల్లో ఉంటూ చెరువుల్లోకి ఎలాంటి ఆక్రమణలు, నిర్మాణాలు రాకుండా కాపలా పెట్టేందుకు సన్నాహాలను పూర్తిచేసినట్టు అధికారులు తెలిపారు. ఉదయం ఇద్దరు, మధ్యాహ్నం ఇద్దరు, రాత్రి ఇద్దరు ఇలా ఆరుగురు ఒక చెరువుకు కాపలాగా ఉంటారని, ఒక్కరు మాత్రం రిజర్వుగా ఉంటారని, ఒక్క చెరువుకు మొత్తం 7 మంది ఒక్కో చెరువుకు లేక్ ప్రొటెక్షన్ గార్డ్స్ కేటాయించి పకడ్బందీగా నిఘా పెట్టనున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. చెరువులపై 24/7 పహారా కాయాలని వారికి ప్రత్యేక సూచనలు చేయనున్నారు. వీరంతా పోలీసు కానిస్టేబుల్స్ పరీక్షలో తక్కువ మార్కులతో ఉద్యోగం కోల్పోయిన వారిని టెంపరరీగా హైడ్రా రిక్రూట్ చేసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానికుల నుంచి కూడా వీరికి పూర్తి సహాయ సహాకారాలు లభించేలా అక్కడి కాలనీ వాసులకు సూచనలు కూడా చేస్తున్నట్టు సమాచారం.
70 చెరువులపై గస్తీ టీమ్స్
కుచించుకుపోతున్న చెరువులను ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేసి గస్తీని ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించినట్టు సమాచారం. ముందుగా 70 చెరువులను ఎంపిక చేసి వాటిల్లో మట్టి డంప్ చేయకుండా, చెత్త, ఘనవ్యర్థాలు పారబోయకుండా, నిర్మాణాలు, ఆక్రమణలు చెరువుల్లోకి చొచ్చుకురాకుండా ఉండేలా ఈ లేక్ గార్డ్ నిఘా, పర్యవేక్షణ పెట్టనున్నట్టు అధికారులు తెలిపారు.
గతంలో రాత్రిపూట చెరువుల్లో మట్టిని పారబోసి లేదా మట్టితో చెరువుచివర నింపి కబ్జా చేసిన పలు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలను దృష్టిలోపెట్టుకుని కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ఎవరైనా, ఎప్పుడైనా.. టిప్పర్లు, ట్రాక్టర్లతో చెరువుల్లోకి వస్తే వారిని గుర్తించి మట్టి, ఘన వ్యర్థాలు, డంపింగ్ చేసే ప్రయత్నాలు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని కమిషనర్ నిర్ణయించినట్టు తెలిసింది. ఈ లేక్స్ ప్రొటెక్షన్ గార్డ్‌ను త్వరలోనే ఓఆర్‌ఆర్ పరిధిలోని అన్ని చెరువులకు ఏర్పాటు చేసే యోచనలో హైడ్రా ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. నగర శివారులోని చెరువుల్లోనే అధికంగా ఈ పూడ్చివేతలు, ఆక్రమణలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ గార్డ్ ద్వారా వాటిని పూర్తి అరికట్టాలని కమిషనర్ రంగనాథ్ ప్లాన్‌చేసి అమలు పరుస్తున్నట్టు అధికారులు తెలిపారు.