Monday, January 20, 2025

నటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు.  15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపోతే తామే కూల్చేస్తామని నోటీసులు జారీ చేశారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువులో ఎఫ్టిఎల్, బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణ సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిహెచ్ఎంసి పరిధిలోని చెరువులు, కుంటల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. తుమ్మిడి హడ్డి చెరువులో హీరో నాగార్జున అక్రమంగా ఎన్ కన్వెన్షన్ నిర్మించడంతో దానిని హైడ్రా అధికారులు కూల్చేసిన విషయం విధితమే. ఎఫ్ టిఎల్, బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News