మన తెలంగాణ/హైదరాబాద్ : విజయలక్ష్మి గుట్టు రట్టయింది. రాజకీయ నాయకులతో కలిసి ఆమె కబ్జాలు చేస్తున్నట్లు హైడ్రా గుర్తించింది. విజయలక్ష్మీపై అనేక క్రిమినల్ కేసులున్నాయి. ఏడు విల్లాలకు విజయలక్ష్మీ బిల్డర్‌గా ఉన్నట్లు హైడ్రా గుర్తించింది. 7 విల్లాలను హైడ్రా ఆదివారం నేల మట్టం చేసింది. అమీన్‌పూర్‌లోని వాణినగర్ చెరువులో అక్రమ నిర్మాణాలు చేసిన మాజీ ఎంఎల్‌ఎ కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై కేసు నమోదైనట్లు తెలిసింది. అక్రమ కట్టడాల కూల్చివేతల సమయంలో అడ్డం పడిన విజయలక్ష్మిపై హైడ్రా అధికారులు కేసు నమోదు చేశారు. విజయలక్ష్మీ మల్లంపేట చెరువులో విల్లాలను నిర్మించినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంది ఆదివారం సాయంత్రం తాను ఎటువంటి అక్రమ కట్టడాలు చేపట్టలేదని, అసలు తనకు హైదరాబాద్‌లో ఎటువంటి బిల్డింగులు లేవని చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ వ్యవహారంపై మాజీ ఎంఎల్‌ఎ స్పందించారు. భూసేకరణలన్నీ చట్టబద్ధమైనవేనని చెప్పారు. తన అభ్యంతరాలను అధికారులకు సమర్పించామని స్పష్టం చేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని వివరించారు. తన భూములకు సంబంధించిన లేఅవుట్‌ను 1991లోనే హెచ్‌ఎండిఎ ఆమోదించిందని చెప్పారు. 2015లో కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) జారీ చేశారని కాటసాని వివరించారు.