Tuesday, January 21, 2025

చెరువుల పరిరక్షణకు నిరంతర నిఘా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్ లోపలివైపున ఉ న్న చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యాప్‌ను హైడ్రా రూపొందిస్తుందని, ఈ యాప్‌లోనే అన్ని ఫిర్యాదులు చేసే సౌలభ్యాన్ని క ల్పిస్తున్నామని లేక్ ప్రొటెక్షన్ కమిటీ (ఎల్‌పీసి) చైర్మన్, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా రూపొందిస్తున్న ఈ ప్ర త్యేక యాప్‌లోనే చెరువులతో పాటు ఇతర పబ్లిక్ ప్రాపర్టీస్ ఆక్రమణలపై ఫిర్యాదులు చేయాలని ఆయన స్పష్టంచేశారు. సో మవారం చెరువుల పరిరక్షణపై అధికారులతో ప్రత్యేక సమీక్షా స మావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడు తూ.. చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు హైడ్రా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు వెల్లడించారు. ఔటర్ లోపలి వైపున ఉన్న చెరువులకు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లను గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల అధికారులు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సమగ్రం గా చర్చించినట్టు వెల్లడించారు. ఓఆర్‌ఆర్ పరిధిలోని చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ప్రజావసరాలకు నిర్దేశించిన స్థలాలు,

ఆక్రమణలకు గురికాకుండా ప్రత్యేక ప్లాన్ తో ముందుకు వెళ్ళనున్నట్టు తెలిపారు. చెరువుల ఆక్రమణలకు ఆస్కారం లేకుండా యాప్‌ను తీసుకొస్తున్నట్టు ఆ య న ప్రకటించారు. చెరువుల్లోనూ, ప్రభుత్వ స్థలాల్లోనూ, రో డ్లలోనూ, పార్కుల్లోనూ ఎక్కడ ఆక్రమణలు జరిగినా.. యాప్‌లో ఫిర్యాదు చేయాలనీ, ఈ యాప్‌లో సమాచారం క్షణాల్లో హైడ్రాకు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు రంగనాథ్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించడంతోపాటు వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా హై డ్రా ప్రణాళికలను సిద్దంచేస్తున్నట్టు రంగనాథ్ తెలిపారు. చెరువుల్లో పేరుకుపోయిన డబ్రీస్‌ను ముందుగా తొలగించడం, మొదటి దశలో సున్నంచెరువు, అప్పాచెరువు, ఎర్రకుంట, కూకట్‌పల్లి నల్లచెరువుతో పనులు ప్రారంభించాలని నిర్ణయించినట్టు లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ రంగనాథ్ వెల్లడించారు. ఓఆర్‌ఆర్ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి.? ఎంతమేర ఆక్రమణలకు గురయ్యాయి..? అనే విషయాలను గుర్తించి తెలపాలని అధికారులకు ఆయన సూచించారు. చెరువుల ఎఫ్‌టిఎల్ నిర్థారణకు శాస్త్రీయ పద్దతులను అనుసరించే అంశాలపైన,

గతంలో నిర్ధారించిన ఎఫ్‌టిఎల్ హద్దులను సరిచేయాలని అందుకు చర్యలు తీసుకోనున్నట్టు ఆయన పేర్కొన్నారు. చెరువుల లింక్ రోడ్లను కూడా పునరుద్దరించే దిశగా హైడ్రా ప్లాన్ చేస్తున్నట్టు, గొలుసుకట్టు చెరువులుగా మార్చేందుకు ప్రయోగాత్మకంగా నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. ఓఆర్‌ఆర్ పరిధిలోని చెరువులకు ఎఫ్‌టిఎల్ ఖరారు చేయడంలో భాగంగా 45 ఏళ్ళ డేటా ఆధారంగా, నీటి విస్తరణను గరిష్టంగా తీసుకోనున్నట్టు రంగనాథ్ పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఎస్‌ఏ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల డేటాతో సరిపోల్చుతూ ఎఫ్‌టిఎల్ నిర్ణయించనున్నట్టు ఆయన వివరించారు. విలేజ్ మ్యాప్స్, భూ వినియోగం సర్వే నెంబర్లతో సహా సమాచారం ఇచ్చే కెడస్ట్రల్ మ్యాప్స్, 45 ఏళ్ళలో పూర్తిస్థాయిలో చెరువును నీరు విస్తరించిన ప్రాంతం సమాచారంతో ఎఫ్‌టిఎల్ హద్దులు నిర్ణయించనున్నట్టు తెలిపారు. హిమాయత్ సాగర్‌లో ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌ల గుర్తింపును ప్రారంభించి అదే విధానా న్ని ఇతర అన్ని చెరువుల విషయాలోనూ అమలు చేయనున్నట్టు రంగనాథ్ తెలిపారు.

చెరువుల ఆక్రమణలపై 2018 లో కాగ్ ఇచ్చిన నివేదికను పరిశీలించడం, ఎక్కడ, ఎలాం టి పొరపాట్లకు తావులేకుండా చెరువులను గుర్తించేందుకు పకడ్బందీగా ప్లాన్ సిద్దంచేవామనీ, చెరువుల పరిరక్షణపై ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపైనా సమీక్షను నిర్వహించి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని చెరువులను భవిష్యత్తు తరాలకు అందించనున్నట్టు లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ రంగనాథ్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News