Wednesday, January 22, 2025

హిమాయత్‌సాగర్‌పై హైడ్రా గురి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రాజేంద్రనగర్/నార్సింగి: రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు సూపర్ పవర్స్ ఇవ్వడంతో బడా బాబుల గుండెళ్లో రైలు పరుగెడుతున్నాయి. నీటి వనరుల ఫుల్ ట్యాంక్ లెవల్స్‌తో పాటు బఫర్ జోన్‌లలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. నిజాం కా లం నుంచి జంట నగరాల ప్రజల దాహార్తి తీ ర్చుతూ వస్తున్న జంట జలాశయాల్లో ఒకటైన హి మాయత్ సాగర్ పరివాహకంలో కబ్జాల కూల్చివేతలపై హైడ్రా గురి పెట్టింది. ఒకటి, రెండు రో జుల్లో హిమాయత్ సాగర్ జలాశయం అక్రమణ ల తొలగింపునకు హైదరాబాద్ విపత్తు ప్రతి స్పం దన, ఆస్తుల పర్యవేక్షణ మరియు రక్షణ సంస్థ (హైడ్రా) రంగం సిద్ద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే దాదాపు 83 అక్రమణలను హై డ్రా గుర్తించగా, వాటిలో చాలా వరకు బడాబాబులు, రాజకీయ నేతల ఫౌమ్ హౌస్‌లు, విల్లాలు ఉన్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ గండిపేట మండల రెవిన్యూ పరిధిలోని హిమాయత్ సాగర్ పాత విలేజ్‌లో హిమాయత్‌సాగర్ ప్రధాన జలయం ఉంటుంది. ఇక హిమాయత్ సాగర్ ఎగువకు శంషాబాద్ , మొయినాబాద్ మండల పరిధిలోని కొన్ని గ్రామాలు చుట్టురా ఉన్నాయి. క్యాచ్ మెంట్ ఏరియా దాదాపు ఆ రెండు మండలాలతో పాటు షాబాద్ మండలం తదిర ప్రాం తాల గుండా తరువాయి
ఉంటుంది.

అయితే ఈ జలాశయం చుట్టురా పెద్ద సంఖ్యలో ఫామ్ హౌస్‌లు, అందమైన విల్లా భవనాలు నిర్మితమై ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఎలాంటి అనుమతులు లేకుడా నిర్మించినట్లు తెలుస్తుంది. వీటన్నన్నీటిపై హైడ్రా ఇప్పటికే సమగ్ర వివరాలతో కూడిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. బండ్లగూడ జాగీర్ మునిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఏమైన ఇచ్చారా అనే వివరాలు సేకరించాలనుకున్నా ఫలితం లేకుండా పోయింది.అయితే హిమాయత్ సాగర్ జలాశం కబ్జాల విషయం పరిశీలించేందుకు వెళ్లిన ‘మన తెలంగాణ’కు ప్రధాన రహదారి నుంచి చెరువులోకి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లగా అక్కడ ఒక హద్దు కనిపించింది. హద్దుకు కొద్ది అడుగులు వదిలిపెట్టి ప్రహరీల నిర్మాణం, ఓ భారీ భవనం నిర్మాణం, ఒక గార్డెన్ ప్రధాన రహదారి వైపు ఇప్పటికే 75 శాతం పనులు పూర్తి చేసుకుని కనిపించాయి. అయితే వాటి వెనుకాల వైపు వెళ్లగా దూరంగా భారీ బండరాళ్ల మద్య నుంచి ఓ భవనం కనిపించిది. సదరు భవనం రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రిదని తెలిసింది. ఇక వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, బడా రాజకీయ నాయకులు హిమాయత్ సాగర్ చుట్టురా దొరికిన కాడికి ఎఫ్‌టిఎల్స్ , బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిలో ఉన్నారని సమాచారం. ఈ విషయంలో హైడ్రా 83 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు ఇప్పటికే స్పష్టం చేయడం హిమాయత్ సాగర్ జలాశయం ఆక్రమణలకు అద్ధంపడుతుందని చెప్పాలి.

మా తాగునీటి ‘వనరు’ గొంతు కోస్తారా? : ప్రజలు
హైదరాబాద్ నగరాన్ని 1908లో విలవిలలాడించిన వరదలు తిరిగి పునరావృతం కాకుండా నాటి నిజాం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా సుమారు 20 ఏళ్ల నాటికి అంటే 1927న హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేసిన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన పెద్ద కుమారుడై హిమాయత్ అలీ ఖాన్ పేరును ఈ జలాశయానికి నామకరణం చేశారు. అప్పటి నుంచి హిమాయత్ సాగర్ చెరువు పేరు ప్రాచుర్యంలో ఉంది. ఇక ఈ చెరువులోకి వరద నీరు చేరే మార్గాల్లో కూడా భారీగానే కబ్జాలు జరిగినట్లు తెలుస్తుంది. జివో 111 తీసుకువచ్చిన ఆ నాటి ప్రభుత్వం హిమాయత్ సాగర్ ఎగువ నుంచి వరద నీరు చేరే గ్రామాలను జివో పరిధిలోకి తీసుకురాలేదని పరిశోధకులు అంటున్నారు. కొన్ని చోట్ల జివో 111 నిర్ణయం సరైందే అయినా మరి కొన్ని చోట్ల అమలు చేయాల్సిన అవశ్యకత ఎంతో ఉందనేది పర్యావరణ , జలవనుల పరిశోధకుల సూచన. తాజాగా వెలుగులోకి వస్తున్న హిమాయత్ సాగర్ కబ్జాల బాగోతం ఇంత భారీ స్థాయిలో జరిగేదాక అధికారులు ఏమి చేశారనేది ప్రజల సూటి ప్రశ్న. మా గొంతులు తడిపి దాహార్తి తీర్చే హిమాయత్‌సాగర్ గొంతు కోస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News