Sunday, December 22, 2024

ఇప్పుడిక మూసీ ఆక్రమణల వంతు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు మరో కీలక ముందడుగు వేసింది. మూసీనది ప్రక్షాళనలో భాగంగా అక్రమ ని ర్మాణాలను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గోల్నాక, చాదర్‌ఘాట్, మూ సారంబాగ్‌లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ శ ని, ఆదివారాల్లో మూసీనది ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల ని నిర్ణయించినట్టు గా సమాచారం. ఇప్పటికే ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న ఇళ్లను మార్క్ చే సిన అధికారులు ఈ క్రమంలోనే 1,350 మం దికి తాజాగా నోటీసులు జారీ చేయడం విశేషం. అందులో భాగంగా మూసీ నివాసిత ప్రాంతాల ను బుధవారం మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబా ద్ జిల్లా కలెక్టర్లు సందర్శించారు. అక్కడి ప్రజల తో మాట్లాడి వారు ఇళ్లను ఖాళీ చేసేలా వారితో చర్చలు జరిపారు.

వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా అధికారులు చర్యలు చేపట్టారు. శని, ఆదివారాల్లో మూసీ ఆక్రమణలను కూల్చివేయనున్నట్టుగా తెలుస్తోంది. తొలి విడత కూల్చివేతలో భాగంగా మూసీరివర్ బెడ్‌లో 1,600 ఇళ్లను అధికారులు తొలగించనున్నారు. ఇప్పటివరకు మూసీ పరీవాహక ప్రాంతంలో పదివేల కుటుంబాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అది సుమారుగా 16 వేల కుటుంబాలకు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే మూసీరివర్ బెడ్‌లో మొత్తం 2,166 అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. అందులో హైదరాబాద్ పరిధిలో ఉన్న మూసీరివర్ బెడ్‌లో 1,595, మేడ్చల్ మల్కాజిగిరిలో 239, రంగారెడ్డిలో 332 అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. ఇప్పటికే మూసీ నిర్వాసితుల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News