Monday, January 20, 2025

హైడ్రా ఆర్డినెన్స్

- Advertisement -
- Advertisement -

గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం
పూర్తిస్థాయిలో చట్టబద్ధత
విస్తృత అధికారాలతో ప్రత్యేక
ఆర్డినెన్స్‌కు సర్కార్ రూపకల్పన
హైడ్రాకు ఎదురవుతున్న
ఆటంకాల నేపథ్యంలో
ప్రభుత్వం కీలక నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రభుత్వం విస్తృత అధికారాలు కల్పిస్తూ జీహెచ్‌ఎంసీ చట్టంలో ప్రత్యేక సెక్షన్‌ను చేర్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైడ్రాకు ఎ దురవుతున్న ఆటంకాలను తొలగించేలా రాష్ట్ర ప్ర భుత్వ ప్రత్యేకంగా రూపొందించిన ఆర్డినెన్స్ గ వర్నర్ ఆమోదించారు. జిహెచ్‌ఎంసి 1955 చ ట్టంలోని సెక్షన్ 374బి అధికారాలను హైడ్రాకు బది లీ చేయడంతో పాటు మున్సిపల్ చట్టంలో కొ న్ని అధికారాలను కూడా ఇందులో చేర్చుతూ రా ష్ట్రప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను రూపొందించగా దీ ని కి కేబినెట్ 10 రోజుల క్రితం ఆమోదించింది. వెంటనే ఈ ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపగా 10 రో జుల తరువాత మంగళవారం ఈ ఆర్డినెన్సుకు గ వర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు.

ఓఆర్‌ఆర్ పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు నాలాలను పరిరక్షిస్తూ సర్వాధికారాలు ఇచ్చేలా ఈ చ ట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ నేపథ్యంలోనే హైడ్రాకు పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభిస్తుందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకు న్న నిర్ణయం మేరకు రాష్ట్ర మున్సిపల్ చట్టం 20 19, హైదరాబాద్ వావాటర్ వర్క్ చట్టం 1989, హెచ్‌ఎండిఏ చట్టం 2008లోని కొన్ని అధికారాలను హైడ్రాకు కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం రూపొందించింది.
కాలానుగుణంగా అధికారాలు మారేలా తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు హైడ్రాకు ఎదురవుతున్న కొన్ని ఆటంకాలను తొలగిస్తూ, దానికి విశేష అధికారాలు కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం రూపొందించింది. హైడ్రాకు బదలాయించిన అధికారాలను వివరిస్తూ జీహెచ్‌ఎంసీ చట్టం 1955లో ప్రత్యేకంగా 374-బి సెక్షన్‌ను చేర్చారు.

ఈ సెక్షన్ ప్రకారం రాష్ట్రంలోని ఒక కార్పొరేషన్, లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్లు, డ్రైనేజీలు, వీధులు, నీటి వనరులు, ఖాళీ స్థలాలు, పార్కులు, ఇతర ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా వాటిని పరిరక్షించడానికి అవసరమైన అన్ని అధికారాలను హైడ్రాకు బదిలీ చేస్తూ ఆయా అంశాలను ఈ ఆర్డినెన్స్‌లో పొందుపరిచారు. అధికారాలనైనా అమలు చేయడానికి, బదలాయించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుందని ఈ సెక్షన్‌లో పేర్కొన్నారు. కాలానుగుణంగా ప్రభుత్వం సూచించిన ఈ అధికారాలు మారుతూ ఉంటాయని సెక్షన్ 374-బిలో పొందుపర్చారు. అంటే ప్రభుత్వం ఓఆర్‌ఆర్ పరిధిలోని అన్ని రకాల ప్రభుత్వ శాఖల (జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్ వర్క్, రెవెన్యూ, మున్సిపాలిటీలు) అధికారాలను హైడ్రాకు బదిలీచేస్తూ ఈ ఆర్డినెన్స్‌ను రూపొందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News