Saturday, April 26, 2025

బిఆర్ఎస్ పోస్టర్లను తొలగించిన హైడ్రా సిబ్బంది.. రంగనాథ్ ఎమన్నారంటే?

- Advertisement -
- Advertisement -

ఏప్రిల్ 27న వరంగల్ లో బిఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఆ సభకు సంబంధించిన పోస్టర్లను హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటు చేశారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో పోస్టర్లను హైడ్రా సిబ్బంది కొంతమంది తొలగించారు. బిఆర్ఎస్ రజతోత్సవ పోస్టర్లను తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. హైదరాబాద్‌లో పోస్టర్ల తొలగింపు సాధారణంగా జరిగే ప్రక్రియలో భాగమేనన్నారు. పోస్టర్ల తొలగింపు  ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేస్తామని ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News