Monday, December 23, 2024

నిర్మాణాలు కూల్చి చెరువులను రక్షించడం లక్ష్యం కాదు

- Advertisement -
- Advertisement -

మనసు చంపుకొని కూల్చాల్సి వస్తోంది: రంగనాథ్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: అనుమతులు లేకుండా చెరువుల్లో నిర్మించిన భవనాలు పెద్దవాళ్లవైనా, పేదల వైనా కూల్చక తప్పదనీ, మానవత్వం కోణంలో ఆలోచిస్తే సమా జమంతా బాధపడుతుందని, కొన్ని చోట్ల మనుసును చంపు కొని కూల్చివేయాల్సి వస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగ నాథ్ తన మనసులోని మాటను వెల్లడించారు. ఇకనుంచి చెరువులోకి కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే హైడ్రా లక్ష్యమని చెప్పారు. శనివారంనాడు సాగునీటిపారుద ల శాఖ మాజీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చెరువులో నీటి విస్తీర్ణం, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లు, విలేజ్ మ్యాప్‌లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నామనీ, ఎవరి లెక్కలు వారివి కాకుండా అన్ని శాఖల సమాచా రంతో నిపుణుల కమిటీని వేసి చెరువుల హద్దులు, ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లను నిర్ణయిస్తామని రంగనాథ్ స్పష్టంచేవారు.

అమీన్ పూర్ చెరువు తూములు మూయడంతో ఎగువన ఉన్న లేఔట్లు మునిగాయనీ, ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరముందన్నారు. అనుమతులు లేకుం డా ఉన్న పెద్దవాళ్లవైనా, పేదల వైనా కూల్చక తప్పదనీ, హైడ్రా కూల్చివేతలతో ప్రజల్లో ఎఫ్ టీఎల్ , బఫర్ జోన్లపై అవగాహన వచ్చి చర్చ జరిగిందని రంగనాథ్ పేర్కొన్నారు. ఎఫ్ టీఎల్ నిర్ధారించాక.. చెరువుల్లో ఏదైన అక్రమ నిర్మాణం చేపడితే మాకు అలర్ట్ వస్తుందన్నారు. బెంగుళూరులో చెరువుల పరిరక్షణ బాగుందనీ, అక్కడ పర్యటించి అధ్య యనం చేశాం. పూర్తి స్థాయి నీటి మట్టాలను పరిగణనలోకి తీసుకొని కర్ణాటకలో చెరువుల హద్దులు నిర్ధరిస్తున్నారు.. ఆ ప్రకారం ఆక్రమణల వుంటే తొలగిస్తు న్నార ని వెల్లడించారు. శిఖం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. అక్రమ నిర్మాణాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికతను ఉపయో గిస్తున్నాం.

చెరువులు ఆక్రమణలకు గురికాకుండా స్థానికులు నిఘా పెడుతున్నారని రంగనాథ్ తెలిపారు. అంతకుముందు చెరువుల విస్తీర్ణం, ఎఫ్‌టిఎల్ బఫర్ జోన్ల నిర్ధారణపై నిపుణుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లు, రెవెన్యూ రికార్డుల్లోని మ్యాప్‌లపై సూపర్ ఇంపోజ్ చేయడం ద్వారా ప్రస్తుతం హెచ్‌ఎండిఏ పరిధిలోని చెరువులకు ఎఫ్‌టిఎల్ నిర్ణయించినట్టు మాజీ అధికారి తెలిపారు. గ్రౌండ్ హద్దులను, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లను సరిపోల్చి సూపర్ ఇంపోజ్ చేస్తే రెవెన్యూ రికార్డుల్లోని చెరువు విస్తీర్ణానికి మించి అదనంగా 510 ఎకరాలు అదనంగా చెరువులోకి వస్తుందని, ఆ భూమిని కూడా కలుపుకుని ఎఫ్‌టిఎల్ ఖరారు చేసినట్టు వారు వివరించారు. హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్ హద్దు మాదాపూర్ పోలీసు స్టేషన్ వద్ద ఉందని ఓ మాజీ ఇంజనీర్ తెలిపారు. అమీన్‌పూర్ చెరువు విస్తీర్ణం వాస్తవానికి 460 ఎకరాలైతే చెరువులోని నీటి విస్తీర్ణం ప్రాతిపదికగా చెరువు విస్తీర్ణం 96 ఎకరాలు అని, ఓ వ్యక్తికి సమాచార హక్కు చట్టం ప్రకారం తెలపడం జరిగిందని, దీంతో చెరువు మొత్తం విస్తీర్ణాన్ని 96 ఎకరాలుగా పట్టుబడుతున్నారనీ, దీనిని సరిచేయాల్సిన అవసరం ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఓ మాజీ ఇరిగేషన్ అధికారి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News