కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ చింతల్ శ్రీనివాస్‌నగర్‌లో హైడ్రాలిక్ జాక్‌ల సహాయంతో పురాతన బిల్డింగ్‌నిపైకి లేపడానికి ఇంటి యజమాని ప్రయత్నం చేశారు. అయితే ఆ భవనం కాస్త హైడ్రాలిక్ జాక్‌ల పట్టుతప్పి పక్కన ఉన్న ఇంటిపై ఒరిగింది. ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్‌కి ఆనుకోవడంతో రెండు బిల్డింగ్‌లు ఎప్పుడు కూలుతాయో తెలియక ఇంట్లో ఉన్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంట్లో అద్దెకు ఉండే వారిని సురక్షితంగా బయ టకు తీసుకొచ్చి వేరే ప్రాంతానికి తరలించారు.
ఎటువంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చి హైద్రాలీక్ జాక్‌ల ద్వారా ఇంటిని పైకిలేపే ప్రయత్నం చేసిన యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం జిహెచ్‌ఎంసి అధికారులు భవనాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సహాయంతో కూల్చివేశారు. ఇదిలా ఉండగా కుత్బుల్లాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సాంబయ్య, పోలీసులు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని తగు జాగ్రత్తలు తీసుకొని రేపు ఉదయం కూల్చివేస్తామని వెల్లడించారు.