Monday, December 23, 2024

అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:బ్రహ్మపుత్ర నదీజలాలను అడ్డుపెట్టుకుని చైనా భారత్‌పై వరద ముప్పును ప్రయోగించాలని వ్యూహాలు పన్నుతోంది. భారత్ ఈశాన్య ప్రాంతంలోకి పై ప్రాంతాల నుంచి ప్రవేశించే నదులపై బీజింగ్ ఆనకట్టలు నిర్మించింది. వీటినుంచి హఠాత్తుగా విడుదల చేస్తే దిగువ ప్రాంతాలను వరద ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంతర సమీపంలోని మెడాగ్ వద్ద 60వేల మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికిప్రణాళికలు రచిస్తోంది. దీంతో అప్రమత్తమైన భారత్ చైనా కుట్రను ఎదుర్కొనేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లాలో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలనే ప్రతిపాదనను భారత్ పరిశీలిస్తోంది. సుమారు 11వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చైనా నుంచి వచ్చే వరదనీటిని నిల్వచేసేలా బఫర్ స్టోరేజీకి ఉపయోగపడుతుంది. 900కోట్ల క్యూబిక్ మీటర్ల నీరును నిల్వ చేసేలా డ్యామ్‌ను నిర్మించనున్నట్లు సమాచారం. బ్రహ్మపుత్ర నది వరదలను అడ్డుకోవడానికి ప్రధానంగా ఈ డ్యామ్ నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News