Friday, January 3, 2025

చైనాకు చెలగాటం.. భారత్‌కు ఇరకాటం

- Advertisement -
- Advertisement -

భారత్, నేపాల్‌లతో చైనా తన సరిహద్దుల ముక్కోణపు కూడలికి బాగా దగ్గరగా యార్లుంగ్ జాంగ్బో నదిపైన, గంగా ఉపనదిపైన టిబెట్‌లో కొత్త డ్యామ్‌ను నిర్మిస్తున్నదన్న వార్త కొన్ని సంవత్సరాలుగా వివిధ వార్తా పత్రికల్లో ప్రచురితమైంది. ఆ డ్యామ్‌ను ఉపగ్రహ చిత్రాల ఆధారంగా దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహం నియంత్రణకు చైనా ఉపయోగించుకోవచ్చు. యార్లుంగ్ త్సాంగ్పోపై డ్యామ్ ప్రదేశం ప్రపంచంలో అత్యంత జలవిద్యుత్ సంపన్న ప్రాంతాల్లో ఒకటి అని ప్రభుత్వ యాజమాన్యంలోని చైనా విద్యుత్ నిర్మాణ సంస్థ (పిసిసిసి) అప్పటి చైర్మన్ యాన్ ఝియాంగ్ 2020లో చెప్పినట్లు మీడియా వెల్లడించింది. ‘దిగువ పరివాహక ప్రాంతం 50 కిమీ దూరం మేర 2000 మీటర్లు నిట్టనిలువుగా నీరు పడుతుంటుంది.

అది అభివృద్ధి చేయదగిన సుమారు 70 మిలియన్ కిలో వాట్ల వనరులతో సమానం 22.5 మిలియన్ కిలోవాట్ల స్థాపక ఉత్పాదక శక్తి గత మూడు త్రీ గార్జెస్ డ్యామ్‌ల కన్నా అధికం’ అని ఆయనను ఉటంకిస్తూ ‘పోస్ట్’ తెలిపింది. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిన్‌హువా వార్తా సంస్థ ఉటంకించిన అధికార ప్రకటన ప్రకారం, తుదకు 2024 డిసెంబర్ 25న అన్ని సందేహాలను పరిహరిస్తూ చైనా ప్రభుత్వం బ్రహ్మపుత్రకు టిబెట్ పేరు అయిన యార్లుంగ్ జాంగ్బో నది దిగువ పరివాహక ప్రాంతాల్లో ఒక జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆమోదించింది. జల విద్యుత్ ప్రాజెక్టు యార్లుంగ్ జాంగ్బో నది దిగువ పరివాహక ప్రాంతంలో ఉంటుంది. హిమాలయ ప్రాంతంలో ప్రధాన ఇరుకైన లోయలో డ్యామ్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ నది నాటకీయంగా యుమలుపు తీసుకుని అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవహించి, చివరగా బంగ్లాదేశ్‌కు చేరుకుంటుంది.

ఆ డ్యామ్ చైనాకు నదీ ప్రవాహంపై నియంత్రణాధికారం కల్పిస్తుందని, ప్రాజెక్టు స్థాయి కారణంగా సరిహద్దు ప్రాంతాలను వరదల్లో ముంచెత్తేందుకు అవకాశం ఇస్తూ, సంక్షోభ సమయాల్లో అధిక మొత్తంలో నీటి విడుదలకు వీలు కల్పిస్తుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. కానీ, బ్రహ్మపుత్ర నదిపై చైనా భాగంలో డ్యామ్ నిర్మాణాన్ని ఆమోదించాలన్న తన నిర్ణయాన్ని చైనా సమర్థించుకున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌ను టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించాలన్న చైనా యోచనపై భయాందోళనలు అనవసరమని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ డిసెంబర్ 27న అన్నారు. మెగా ప్రాజెక్టు దిగువ నదీ పరివాహక దేశాలను ప్రభావితం చేయదని, దశాబ్దాల తరబడి అధ్యయనాల ద్వారా వాటి భద్రత ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని సరి చేయడమైందని మావో నింగ్ స్పష్టం చేశారు, 137 బిలియన్ డాలర్ల ప్రాజెక్టును టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దు పొడుగునా పర్యావరణపరంగా సున్నితమైన హిమాలయ ప్రాంతంలో నిర్మిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద డ్యామ్ ప్రభావం పల్లపు ప్రాంతాలపై పడదని ఆమె చెప్పారు.

సీమాంతర నదుల అభివృద్ధి పట్ల చైనా ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా ఉంటున్నట్లు, టిబెట్‌లో జలవిద్యుత్ అభివృద్ధిపై దశాబ్దాల పాటు అధ్యయనం చేసినట్లు, ప్రాజెక్టు భద్రతకు, పర్యావరణ, వాతావరణ పరిరక్షణకు సముచిత చర్యలు తీసుకున్నట్లు మావో నింగ్ తెలియజేశారు. భారత సరిహద్దుకు సమీపంగా టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై 137 బిలియన్ యుఎస్ డాలర్లు విలువ చేసే భూగ్రహంపై అతిపెద్ద మౌలిక వసతుల ప్రాజెక్టుగా పేర్కొంటున్న ప్రపంచంలోనే ప్రతిపాదిత అతిపెద్ద డ్యామ్ నదీ పరివాహక దేశాలు భారత్, బంగ్లాదేశ్‌లలో ఆందోళనలు కలిగిస్తోంది. డ్యామ్‌పై మొత్తం పెట్టుబడి ఒక ట్రిలియన్ యువాన్లు (137 బిలియన్ డాలర్లు) దాటిపోగలదు. ప్రపంచంలోనే అతిపెద్దదిగా పరిగణిస్తున్న చైనా సొంత త్రీ గార్జెస్ డ్యామ్ సహా ఈ గ్రహంపై ఏ ఇతర ఒక్క మౌలికవసతుల ప్రాజెక్టు ఖర్చును మరుగుజ్జును చేస్తుంది. హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక భారీ లోయలో డ్యామ్‌ను నిర్మించనున్నారు. అక్కడ బ్రహ్మపుత్ర నది భారీగా యు మలుపు తీసుకుని అరుణాచల్ ప్రదేశ్‌లోకి, చివరకు బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. చైనా ఇప్పటికే 2015లో టిబెట్‌లో అతిపెద్దదైన 1.5 బిలియన్ డాలర్ల జామ్ జల విద్యుత్ కేంద్రాన్ని పని చేయించసాగింది.

కైలాస శిఖరం నుంచి టిబెట్ మీదుగా భారత్, బంగ్లాదేశ్‌లకు పేర్ల మార్పుతో ప్రవహిస్తున్న నదిపై మెగా డ్యామ్‌ల నిర్మాణం గురించి పోటాపోటీగా వ్యవహరిస్తున్నా రెండు దేశాలు సీమాంతర నదులకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు 2006లో నిపుణుల స్థాయి యంత్రాంగం (ఇఎల్‌ఎం)ను ఏర్పాటు చేశాయి. దాని కింద వరద కాలాల్లో బ్రహ్మపుత్ర నది, సట్లెజ్ నదికి సంబంధించి జలప్రవాహ సమాచారాన్ని భారత్‌కు చైనా అందజేస్తున్నది. సరిహద్దు అంశానికి సంబంధించి భారత, చైనా ప్రత్యేక ప్రతినిధులు (ఎస్‌ఆర్‌లు) ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి మధ్య డిసెంబర్ 18న బీజింగ్‌లో జరిగిన చర్చల్లో సీమాంతర నదుల డేటా పంచుకోవడమైంది.

అరుణాచల్ ఎగువ సియాంగ్ జిల్లాలో సియాంగ్ నదిపై 11 వేల మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టును భారత్ నిర్మించనున్నది. అరుణాచల్ ప్రదేశ్‌ను తన భూభాగంలోనిదిగా పరిగణించే చైనా భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కలవరం చెందుతోంది. యార్లుంగ్ జాంగ్బో నదిపై మెగా డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మించాలన్న చైనా ప్లాన్‌కు స్పందనగా భారత్ ఈ నిర్ణయం తీసుకున్నదని వ్యూహాత్మక విశ్లేషకులు పేర్కొన్నారు. జలవిద్యుత్ ప్రాజెక్టును ఒక ఆయుధంగా చైనా వాడుకుంటుందన్న పేరు ఇప్పటికే ఉన్న దృష్టా అటువంటి వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి దిగువ నదీ పరివాహక దేశమైన భారత్‌ను చైనా ప్లాన్ పురికొల్పుతోంది.

సీమాంతర దేశాలపై దూకుడుగా వ్యవహరించేందుకు తన డ్యామ్‌లను ఉపయోగించుకుంటున్న చరిత్ర చైనాది. 2021లో చైనా ఎటువంటి ముందస్తు హెచ్చరికా లేకుండా మెకాంగ్ నదిలో జల ప్రవాహాన్ని మూడు వారాల పాటు 50 శాతం మేర కుదించింది. విద్యుత్ లైన్ల నిర్వహణ పేరిట చైనా ఆ కోత పెట్టింది. కానీ, అది ఆగ్నేయాసియా దేశాలు కాంబోడియా, లావోస్, మయన్మార్, థాయిలాండ్, వియత్నామ్‌లలో జల మార్గాల పొడుగునా నివసిస్తున్న కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపింది. ఆ డ్యామ్ బీజింగ్‌కు నదీ ప్రవాహం నియంత్రణకు అధికారం ఇస్తుంది. ఆ నది చైనా, భారత్, భూటాన్, బంగ్లాదేశ్ సహా దేశాల్లో సుమారు 1.8 బిలియన్ల మంది ప్రజలకు తాగునీటిని అందిస్తున్నది.

అరుణాచల్ ప్రదేశ్‌లో సియాంగ్ నదిపై భారత్ నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టు డిజైన్‌లో పీక్ వర్షాకాలాల్లో 9 బిలియన్ ఘనపు మీటర్లకు పైగా నీటి ‘బఫర్ నిల్వ’ను చేర్చారు. నీటి ప్రవాహం తగ్గినప్పుడు అది రిజర్వ్‌గా ఉపయోగపడుతుంది. చైనా అకస్మాత్తుగా నీటిని విడుదల చేసినట్లయితే అరుణాచల్, అస్సాంలలో దిగువ ప్రాంతాలకు బఫర్‌గా ఉపయోగపడుతుంది.
బ్రహ్మపుత్ర బేసిన్ విస్తీర్ణం 580000 చదరపు కిలోమీటర్లు, అది చైనా (50.5 శాతం), భారత్ (33.6 శాతం), బంగ్లాదేశ్ (8.1 శాతం); భూటాన్ (7.8 శాతం)లకు వర్తిస్తుంది. భారత్‌లో నిడివి 916 కిమీ. బ్రహ్మపుత్ర బేసిన్ పరిధిలో భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, నాగాలాండ్, మొత్తం సిక్కిం ఉన్నాయి. అంటే బ్రహ్మపుత్ర నీటిలో చైనా వాటా 50 శాతం మించి లేదని దాని అర్థం. అంటే, బ్రహ్మపుత్ర నీటి ప్రవాహంపై చైనా జోక్యం సగాన్నే ప్రభావితం చేస్తుందన్న మాట. బ్రహ్మపుత్రకు సంబంధించి అత్యంత దిగువన ఉన్న నదీ పరివాహక దేశం బంగ్లాదేశ్ భయం కనీసం రెండు మెగా డ్యామ్‌ల వల్ల నష్టపోతామన్నది. వాటిలో ఒకటి చైనాలోని టిబెట్‌లో ఉండగా, మరొకటి భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్నది. బ్రహ్మపుత్ర జలశాస్త్రాన్ని, నదిని పంచుకుంటున్న వివిధ దేశాలలో దానిపై మానవ జోక్యాన్ని మనం అధ్యయనం చేస్తుంటే బంగ్లాదేశ్ భయాన్నీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.

వాతావరణ మార్పు జలశాస్త్రం బేసిన్‌ను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఏడాది పొడుగునా వర్షపాతంలో గణనీయమైన పెరుగుదల ఉన్నది. జూలై, సెప్టెంబర్ మధ్య గరిష్ఠంగా ఉంటుంది. బ్రహ్మపుత్ర నది రెండు అధిక నీటిమట్టం సీజన్‌లను చూస్తుంటుంది. ఒకటి వేసవి ఆరంభంలో పర్వతాల్లో మంచు కరగడంవల్ల చోటు చేసుకుంటుండగా, వేసవి చివర్లో వర్షరుతువు వర్షాల వల్ల సంభవిస్తుంటుంది. హిమానీ నదాల్లో మంచు కరగడం వల్ల నదిలో ప్రవాహం బాగా ఎక్కువగా ఉంటున్నది. ఆ హిమానీ నదాలు ప్రధానంగా బేసిన్ ఎగువ భాగాల్లో తూర్పు హిమాలయ ప్రాంతాల్లో ఉన్నాయి. మంచు, హిమానీ నదాలు కరగడం వల్ల నీటి వాటా మొత్తం వార్షిక ప్రవాహంలో దాదాపు 27 శాతం ఉంటుంది. తక్కిన భాగం వార్షిక వర్షపాతం వల్ల సమకూరినది. విభిన్న శక్తుల నియంత్రణలోని మీడియా ప్రభావంతో హడావిడిగా తుది నిర్ణయానికి వచ్చే ముందు ఈ అంశాలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. నది నీటిని పంచుకోవడంపై దేశాల మధ్య వివా దం కొత్త ఏమీ కాదు. ఆచరణాత్మక శాస్త్రీయ దృక్పథంతో డేటాను పరిశీలిస్తూ నది నీటి పంచుకోవడంపై వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలి. జాతీయవాదంతో కూడిన రాజకీయం వివా ద పరిష్కార యంత్రాంగంలో జోక్యంచేసుకోరాదు.

(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక,
రాజకీయ అంశాల విశ్లేషకుడు)

ఈశాన్యోపనిషత్

గీతార్థ పాఠక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News