Tuesday, November 19, 2024

క్షమాపణ చెప్పడానికి సిద్ధం: జబర్థస్త్ నటుడు ఆది

- Advertisement -
- Advertisement -

Hyper aadi ready to apologize

 

మనతెలంగాణ/హైదరాబాద్: తాను కేవలం ఆర్టిస్టును మాత్రమేనని, చిన్న పొరపాటు జరిగిందని, తాను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని జబర్థస్త్ నటుడు హైపర్ ఆది వివరణ ఇచ్చాడు. ఈక్రమంలో తెలంగాణ యాస, భాష సంస్కృతిని అవమానపరిచాడని జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

తెలంగాణ యాస, భాష సంస్కృతిని అవమానపరిచాడని.. బతుకమ్మ, గౌరమ్మలను కించపరుస్తూ మాట్లాడాడని ఈ విషయంపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ మాట్లాడుతూ.. హైపర్ ఆది మాటలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయి. వెంటనే ఆది బేషరతుగా క్షమాపణ చెప్పాలి లేదంటే.. తెలంగాణలో తిరగనివ్వం. షూటింగ్ స్ఫాట్ కి వెళ్లి హైపర్ ఆదిని అడ్డుకుంటాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై హైపర్ ఆది స్పందించారు. తాను ఎక్కడ తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా మాట్లాడ లేదని, ఆ షో లో నేను కేవలం ఆర్టిస్ట్ ను మాత్రమే నని, ఆ స్క్రిప్ట్ నేను రాయలేదని, బహుశ ఎడిటింగ్ తప్పిదం వల్ల పొరపాటు జరిగి ఉండవచ్చన్నారు. తెలంగాణ ప్రజలక్షమాపణకు సిద్ధం గా ఉన్నాను అని ఆది చెప్పాడు. గతంలో కూడా ఆదిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఆది ఓ స్కిట్ చేశారని ఆరోపిస్తూ పలువురు అనాథ పిల్లలు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ లు హెచ్‌ర్‌సికి ఫిర్యాదు చేపిన విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News