Sunday, November 24, 2024

హైపర్‌బేరిక్ థెరపీతో ఎన్నో ప్రయోజనాలు

- Advertisement -
- Advertisement -

ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినప్పుడు గాయాలు త్వరగా నయం కాకుంటే ఇన్‌ఫెక్షన్ విస్తరించే ప్రమాదం ఉంటుంది. అందుకే వైద్యులు శక్తివంతమైన యాంటీబయోటిక్స్‌ను వినియోగించాలని సూచిస్తుంటారు. అయినప్పటికీ కొందరికి గాయాలు కొందరికి ఎంతకీ మానకుండా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి వారికి రూపొందించిందే హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ (హెచ్‌బిఒటి). మొండి గాయాలు, మధుమేహం పుండ్లు, కాలిన గాయాలు ఏర్పడిన భాగంలో రక్త సరఫరా తగ్గిపోతుంది. గాయాలు మరీ తీవ్రమైతే అసలు రక్తం సరఫరా ఉండదు. అందువల్ల ఆ భాగానికి ఆక్సిజన్ అసలే ఉండదు.

Also Read: విజువల్ ఫీస్ట్ లా ఆదిపురుష్ ట్రైలర్

అయితే హెచ్ బీఓటి లో ఒత్తిడిని 1.5 నుంచి 3 రెట్లు వరకు పెంచడం వల్ల శరీరం లోకి ఆక్సిజన్ సరఫరా అధికమవుతుంది. దీంతో గాయాలు ఏర్పడిన భాగానికి అవసరమైన ఆక్సిజన్ అందుతుంది. కొత్త కణాలు, సూక్ష్మ రక్త నాళాలు పుట్టుకొచ్చి గాయం వేగంగా మానుతుంది. హైపర్ అంటే పెంచడం. బేరిక్ అంటే ఒత్తిడి. ఒత్తిడిని పెంచడం ద్వారా వ్యాధిని నయం చేసే ఈ ప్రక్రియను హైపర్‌బేరిక్ ఆక్సిజన్ థెరపీగా వ్యవహరిస్తున్నారు. మధుమేహం, క్యాన్సర్, పక్షవాతం తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ థెరపీ మేలు చేస్తుంది. అలసట, తలకు గాయమైన వారు కూడా దీన్ని తీసుకోవచ్చు. మనదేశంలో కూడా కొన్ని ఆస్పత్రుల్లో ఇది అందుబాటు లోకి వస్తోంది. నటి సమంత కూడా ఇటీవల హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ తీసుకున్నారు. హైపర్‌బేరిక్ థెరపీ అనేది ఆక్సిజన్ థెరపీ. ఇది చాలా అరుదుగా ఉపయోగిస్తారు. ఆక్సిజన్ సాయంతో రోగి గాయం, నొప్పి లేదా కొన్ని వ్యాధుల నుండి ఉపశమనం పొందే చికిత్స ఇది. ఈ చికిత్సలో రోగిని అతని మొత్తం శరీరానికి ఆక్సిజన్ ను సరఫరా చేసే గది యంత్రంలో పడుకోబెడతారు.

Also Read: బేగంపేటలో వైకుంఠ ధామాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్

నొప్పి ఉన్నశరీర భాగానికి ఆక్సిజన్ పంపిణీ అవుతుంది. దీని కారణంగా నొప్పి లేదా గాయం త్వరగా నయమవుతుంది. రోగికి ఉపశమనం కలుగుతుంది. ఆక్సిజన్ చర్మానికి కూడా మంచిదని భావిస్తారు. చాలా మంది దీన్ని యాంటీ ఏజెంట్‌గా ఉపయోగిస్తున్నారు. ఈ చికిత్సలో ప్రతిరోజూ రోగికి 60 నుంచి 90 నిమిషాల పాటు హైపర్‌బారిక్ ఛాంబర్ మెషీన్‌లో సౌకర్యవంతంగా పడుకోబెట్టి చికిత్స ఇస్తారు. కొంతమంది రోగులు 20 సెషన్లు తీసుకుంటారు. చికిత్సపై ఆధారపడి సెషన్లు తగ్గిస్తారు. లేదా పెంచుతారు. గది 100 శాతం ఆక్సిజనుతో ఒత్తిడి చేయబడుతుంది. ఇది ఒత్తిడిని పెంచుతుంది. 10 నుంచి 20 రెట్లు ఎక్కువ ఆక్సిజన్ ప్లాస్మా లోకి ప్రవేశిస్తుంది.

Also Read: ముత్తిరెడ్డిపై కూతురు ఫిర్యాదు… కంటతడి పెట్టిన ఎంఎల్‌ఎ

మనం పీల్చే గాలిలో 21 శాతం ఆక్సిజను ఉంటే హైపర్‌బేరిక్ చాంబర్‌లో 200 నుంచి 240శాతం ఆక్సిజన్ స్థాయి ఎక్కువగా ఉండడంతో దాని చుట్టూ ఎలాంటి అగ్ని ఇంథనం లేకుండా చూసేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చికిత్స గదిలో హెయిర్‌స్ప్రే, డియోడరెంట్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, సిగరెట్ లైటర్ కూడా నిషేధింపబడ్డాయి. మందులు పనిచేయనప్పుడు హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ సూచిస్తారు. ఈ థెరపీతో శరీరం లోని మృతకణాలు తొలగిపోయి శరీరం లోని ప్రతి మూలకూ ఆక్సిజన్ అందుతుంది. చాలా నగరాల్లో ఇప్పుడు ఈ థెరపీ అందుబాటు లోకి వచ్చింది.

Also Read: జెసి సోదరుల అనుచరులపై కేసు నమోదు

వృద్ధాప్య ప్రభావాలు తగ్గుదల
చర్మం లోని వృద్ధాప్య ప్రభావాలను ఈ థెరపీ తగ్గిస్తుంది. ఈ యంత్రాన్ని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని కారణంగా చర్మంలో కొత్త కణాలు ఏర్పడతాయి. ఇది స్కిన్‌టోన్‌కు దారి తీస్తుంది. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ థెరపీని తీసుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ చికిత్స రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. దీని కారణంగా దెబ్బతిన్న రక్త నాళాల , కొల్లాజెన్ పెరుగుదల ఉంటుంది. శరీరం త్వరగా కోలుకుంటుంది. పెరిగిన ఆక్సిజన్ స్థాయిలు యాంజియో జెనిసిస్‌ను ప్రేరేపిస్తాయి. ఇది కణజాలంతో ఏర్పడే ఒకరకమైన రక్తనాళం. సకాలంలో చికిత్స తీసుకునే రోగులు, సాధారణ ప్రక్రియ కంటే ఐదు రెట్లు వేగంగా కోలుకుంటారు. ఏదైనా కారణం వల్ల శరీరంలో వాపు ఉన్న రోగులు దీన్ని ఉపయోగించవచ్చు. శరీరంలో ఆక్సిజన్ చేరుకోవడంతో కొత్త తెల్లకణాలు ఏర్పడతాయి. ఇది శరీరం ఇన్‌ఫెక్షన్‌కు వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News