Monday, January 20, 2025

కాంగ్రెస్‌వి కపట విధానాలు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ కపట విధానాలని, రైతుల పక్షాన నిలిచిన ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్సేనని హుజూర్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. ఇటీవలె అమెరికాలోని తానాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత ంగా అందజేస్తున్న 24 గంటల విద్యుత్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా గురువారం హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ వారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పంట పొలాల విస్తీర్ణంపై, పంట పొలాలకు కావాల్సిన నీరు, విద్యుత్‌పై కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులకు పదవులపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని విమర్శించారు.గత ప్రభుత్వాలు వ్యవసాయం చేయడం దండగ అంటే కాదు వ్యవసాయం చేయడం పండుగ అని నిరూపించిన ఘనుడు కెసిఆర్ అన్నారు. యావత్ భారతదేశంలోనే రైతును రాజును చేసిన ఏకైక ప్రభుత్యం కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పధకాలు గురించి ఇతర రాష్ట్రాల ప్రజలు కెసిఆర్‌ను అభినందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రైతులకు ప్రభు త్వం అందజేస్తున్న పధకాలను గురించి ఒక్కొక్కటిగా వివరించారు.

ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, జడ్పిటీసీ కొప్పుల సైదిరెడ్డి, మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపిపి, నర్సింగ్ వెంకటేశ్వ ర్లు గౌడ్, సీనియర్ నాయకులు కెఎల్‌ఎన్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు చి ట్యాల అమర్‌నాద్ రెడ్డి, ప్రధానకార్యదర్శి బెల్లంకొండ అమర్, మహిళా అ ధ్యక్షురాలు దొంతిరెడ్డి పద్మారెడ్డి, ఓరుగంటి నాగేశ్వరరావు, పలువురు ప్ర జాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News