Wednesday, January 22, 2025

హైపోగ్లైసీమియా అంటే లో బ్లడ్ షుగర్

- Advertisement -
- Advertisement -

హైపోగ్లైసీమియా అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తక్కువగా ఉండడం. దీన్ని అతి తక్కువ బ్లడ్ షుగర్ (low blood sugar) అని కూడా పిలుస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయి శరీరం లోని శక్తికి ప్రధాన కారణం. ఈ గ్లూకోజ్ స్థాయి రక్తంలో చాలా తక్కువగా ఉన్నప్పుడు హైపోగ్లైసీమియా సంక్రమిస్తుంది. ఈ వ్యాధిని గుర్తించాలంటే కొన్ని లక్షణాలు తెలుసుకోవాలి. హార్ట్‌బీట్ ఎక్కువ కావడం, అలసట , వణుకు, పాలిపోయిన చర్మం, ఆందెళపగా ఉండడం, చెమటలు పట్టడం, ఆకలి వేయడం, చిరాకు అనిపించడం, నోరు చుట్టూ జలదరింపు, గందరగోళం, మైకం వచ్చినట్టు అనిపించడం, బలహానత,మొదలైన లక్షణాలు కనిపిస్తే హైపోగ్లైసీమియా అని తెలుసుకుని వైద్యులను సంప్రదించాలి.

మధుమేహ ( diabetes ) వ్యాధి గ్రస్తులు మందులు వాడుతున్న సమయంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎలా ఉన్నయో గ్లూకోమీటర్‌ను ఉపయోగించి ఎప్పటికప్పడు చెక్ చేసుకుంటుండాలి. ఈ వ్యాధిని నిర్ధారించడానికి వైద్యులు శారీరక పరీక్షే కాకుండా, వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర కూడా తెలుసుకోవలసి వస్తుంది. హైపోగ్లైసీమియా తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభిస్తారు. అయితే వైద్యులు దగ్గరకు పరీక్ష కోసం వెళ్లేటప్పుడు ఏ లక్షణాలు లేకుంటే ఒకరోజు రాత్రంతా ఏమీ తినకుండా ఉన్న తరువాత వైద్యులను మళ్లీ కలుసుకోవాలి. హైపర్ గ్లైసీమియా అంటే అధిక చక్కెర కన్నా హైపోగ్లెసీమియా (తక్కువ చక్కెర) చాలా పెద్ద సమస్య. ఎందుకంటే నాడీ వ్యవస్థ అడ్రినలిన్, కార్టిసాల్ , తదితర హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. చివరికి గుండె రేటు, రక్త పోటు , డయాబెటిస్ మరింత పెరగడానికి దోహదం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News