Wednesday, January 22, 2025

హైపోగ్లైసీమియా పరీక్షలు…

- Advertisement -
- Advertisement -

హైపోగ్లైసీమియాను గుర్తించడానికి పరీక్షల విషయానికి వస్తే భోజనం ముందు తరువాత రక్తం లోని చక్కెర స్థాయిలను చెక్ చేయవలసి వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు తెలుసుకోవాలి. గ్లూకోజ్‌గా సులభంగా మారే గ్లూకోజ్ టాబ్లెట్లు, పండ్ల రసాలు, లేదా సుగర్ క్యాండీలు, తేనె లేదా నార్మల్ సుగర్ వంటి 15 నుంచి 20 గ్రాముల కార్బొహైడ్రేట్ల వినియోగం, ఇవన్నీ ఈ వ్యాధి చికిత్సలో భాగమౌతాయి.

వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు ఇలాంటి పదార్థాలు తక్షణం ఉపశమనం కలిగిస్తాయి. వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు ఇంజెక్షన్ ద్వారా గ్లూకోజు ఇస్తారు. వెంటనే చికిత్స అందించిన తరువాత ప్రతి 15 నిమిషాలకు రక్తం లోని చక్కెరస్థాయిలను చెక్ చేయాలి. ఈ చికిత్సలో డయాబెటిస్ కోసం తీసుకుంటున్న మందులను మార్చడం కానీ లేదా పాంక్రియాస్ లోని కణుతులను తొలగించవలసి వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News