Monday, December 23, 2024

హ్యూండై భారీ పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

టెస్ట్ ట్రాకులతో పాటు ఇకో సిస్టం
సంబంధ మౌలిక వసతులు కల్పించనున్న హ్యుండై 
రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి గల ఇతర అవకాశాలపై దావోస్‌లో మంత్రి కెటిఆర్‌తో చర్చించిన
హ్యుండై సిఐఒ యంగ్చో చి
తెలంగాణలో మొబిలిటి వ్యాలీనిఏర్పాటు చేస్తున్నాం
 దానికి హ్యుండై పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుంది ఇందుకు దానికి ప్రత్యేక ధన్యవాదాలు  మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావుతో హ్యుండై సంస్థ సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ. 1400 కోట్లన పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. దావోస్‌లోని తెలంగాణ పెవీలియన్‌లో మంత్రి కెటిఆర్‌తో హ్యుండై సిఐఓ యంగ్చో చి (CIO Mr. YoungCho Chi) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మొబిలిటీ క్లస్టర్‌లో ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. ఈ పెట్టుబడితో తమ కంపెనీ టెస్ట్‌ట్రాక్‌లతో పాటు ఇకో సిస్టమ్ అవసరమైన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అనేక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉన్న ఇతర అవకాశాల పైన కూడా విస్తృతంగా చర్చించారు.

అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మొబిలిటీ రంగానికి హ్యుండై పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందన్నారు.
దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా ఒక మొబిలిటీ వ్యాలిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ఇందులో భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చిన హ్యుండై సంస్థకు మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. హ్యుండాయ్ రాకతో రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు మొబిలిటీ రంగంలో వస్తాయన్న ఆశాభావాన్ని కెటిఆర్ వ్యక్తం చేశారు.

37 లక్షల డాలర్ల పెట్టుబడి పెడుతున్న జిఎంఎం ఫాడులర్

Hyundai Kona Electric

మరో అంతర్జాతీయ కంపెనీ హైదరాబాద్‌లో తన తయారీ కేంద్రాన్ని భారీగా విస్తరించనుంది. ఫార్మా కంపెనీలకు అవసరమయ్యే గ్లాస్ రియాక్టర్, ట్యాంక్, కాలమ్ లను తయారు చేసే జిఎంఎం ఫాడులర్ (GMM Pfaudler) హైదరాబాద్ తయారీ కేంద్రంపై అదనంగా 3.7 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతుంది.

జిఎంఎం ఫాడులర్ -ఇంటర్నేషనల్ బిజినెస్ సిఇఒ థామస్ కెహ్ల్, వరల్ ఎకనామిక్ ఫోరమ్, దావోస్ డైరెక్టర్- అశోక్ జె పటేల్ లు మంత్రి కెటిఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ విస్తరణ ప్రణాళికలను వివరించారు. తమ వ్యాపార ప్రణాళికల్లో హైదరాబాద్‌కు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉండడానికి జిఎంఎం ఫాడులర్ ఆసక్తిని వ్యక్తం చేసింది. గ్లాస్ లైనింగ్ పరికరాల ఉత్పత్తి కోసం రెండు సంవత్సరాల క్రితం(2020) 6.3 మిలియన్ డాలర్లతో హైదరాబాద్‌లో జిఎంఎం ఫాడులర్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. అయితే, అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలనుకున్న కంపెనీ అదనంగా మరో 37 లక్షలడాలర్లతో విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. తాజా నిర్ణయంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 300కు చేరుతుంది. అక్టోబర్ 2020 నుంచి- మార్చి 2022 మధ్య కాలంలో కంపెనీ హైదరబాద్ కేంద్రం 700 పరికరాలను వివిధ దేశాలకు ఎగుమతి చేసింది.

ఫార్మా రంగంలోని అపార అవకాశాల కోసం తాము ఇండియా వైపు చూస్తున్నామన్న థామస్ కెహ్ల్, హైదరాబాదీ కేంద్రం ఇందులో కీలక పాత్ర పోషిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. వేగంగా విస్తరిస్తున్న ఫార్మా రంగంలో తమ పెట్టుబడులు కొనసాగుతాయన్నారు. పారిశ్రామిక అనుకూల విధానాలను అమలుచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఫార్మాపరిశ్రమలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటామని థామస్ కెహ్ల్ చెప్పారు.

హైదరాబాద్ కేంద్రాన్ని విస్తరించాలనుకున్న జిఎంఎం ఫాడులర్ నిర్ణయం తనకు సంతోషాన్ని కలిగించిందని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణ వృద్ధిలో భాగం కావాలనుకునే ఎవరికైనా తమ ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. ఫార్మా పరికరాల తయారీ రంగంలో నెంబర్ వన్‌గా ఎదగాలనుకుంటున్న జిఎంఎం ఫాడులర్ లక్ష్యాన్ని చేరడంలో హైదరబాద్ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందన్న నమ్మకం తనుకు ఉందన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలు,వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌కు రానున్న స్వీడన్ కు చెందిన ఇఎంపిఇ డయాగ్నోస్టిక్స్

క్షయవ్యాధిడయాగ్నస్టిక్ కిట్లను తయారుచేసే గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ఇఎంపిఇ డయాగ్నోస్టిక్స్ ప్రకటించింది. రూ.25 కోట్ల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలో ప్రారంభించే కేంద్రంలో నెలకు 20 లక్షల టిబి నిర్ధారణ కిట్‌లను తయారుచేస్తామని కంపెనీ ప్రకటించింది. 5 దేశాల్లో క్లినికల్ పరీక్షలు నిర్వహించి తరువాత హైదరాబాద్‌ను ఎంచుకున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌లో తయారయ్యే కిట్‌లను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది. కాగా అదనంగా రూ. 50 కోట్ల పెట్టుబడితో 150 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను కంపెనీ కల్పించబోతుంది. మొత్తంగా రాబోయే కాలంలో హైదరాబాద్ కేంద్రంపై 25 మిలియన్ యూరోలను పెట్టుబడిగా పెట్టే ఆలోచనలో ఉన్నామని కంపెనీ ప్రకటించింది. మంత్రి కెటిఆర్‌తో ఇఎంపిఇ డయాగ్నోస్టిక్స్ వ్యవస్థాపకుడు, సిఇఒ డాక్టర్ పవన్ అసలాపురం సమావేశం తరువాత తన నిర్ణయాన్ని కంపెనీ ప్రకటించింది.

క్షయ ప్రభావిత 30 దేశాల్లో ఇండియా ఒకటని సిఇఒ పేర్కొన్నారు. కోవిడ్ ప్రభావంతో టిబి చికిత్స, నివారణ పురోగతిలో ప్రపంచం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఇండియాలో టిబి రోగులు ఎక్కువగా ఉన్నారన్న పవన్, యూరప్ దేశాల్లో అయితే చికిత్సకు లొంగని విధంగా టిబివ్యాధి పరిణామం చెందుతున్నారు. ఇప్పటికీ చాలా మంది వ్యాధి చికిత్సకు అవసరమైన యాంటీబయాటిక్‌లను కాకుండా తప్పుడు ఔషధాలను తీసుకుంటున్నారన్నారు. ఫలితంగా టిపి వ్యాప్తి క్రమంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో టిబిని గుర్తించి, సరైన యాంటీబయాటిక్స్ తో చికిత్స చేయడం మునుపటి కంటే చాలా ముఖ్యమైనదన్నారు. ప్రపంచం మానవాళి ఎదుర్కుంటున్న ఈ ముప్పును తప్పించడానికి ఇఎంపిఇ డయాగ్నోస్టిక్స్ పని చేస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని డాక్టర్ పవన్ అసలాపురం చెప్పారు. కిట్ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించిన మంత్రి కెటిఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా హైదరాబాద్ కేంద్రంగా టిబిపై ఇఎంపిఎం చేసే యుద్దానికి తమ సహకారం ఉంటుందని కెటిఆర్ భరోసా ఇచ్చారు.

ఇన్నోవేషన్ రంగం బలోపేతమే… దేశ ప్రగతకి ఏకైకమార్గం

భారతదేశం స్టార్టప్ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించిన ప్రముఖ కంపెనీల స్థాపకులతో మంత్రి కెటిఆర్ చర్చగోష్ఠిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో స్టార్ట్ అప్ ఇకొ సిస్టమ్ బలోపేతానికి సంబంధించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. అత్యంత వేగంగా దేశం అభివృద్ధి సాధించాలంటే ….ఇన్నోవేషన్ కల్చర్ పెరగాల్సిన అవసరముందన్నారు. ఇన్నోవేషన్ అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానమే కాకుండా మానవ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి మొదలుకొని మున్సిపాలిటీ, గ్రామాల సమస్యలకు సైతం పరిష్కారాలు ఇవ్వగలిగే శక్తి ఉండాలన్నారు. ఇన్నోవేషన్ ద్వారా అద్భుతమైన వ్యాపార వాణిజ్య అవకాశాలతో పాటు సమాజం ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. అందుకే భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లను దాటుకొని వేగంగా ముందుకు పోవాలంటే ఇన్నోవేట్, ఇంకుబెట్, ఇంకర్పెట్ త్రిఐ మంత్రమే సరైన మార్గమన్నారు. హైదరాబాద్ నగరంలో ఇన్నోవేషన్ ను మరింతగా పెంచేందుకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఒక ఎనేబులర్‌గా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు.

తాము నమ్మిన ఆలోచన కోసం నిబద్ధతతో కొన్ని సంవత్సరాల తరబడి పని చేయడం…నిజంగా ఒక అద్భుతమని కెటిఆర్ అన్నారు. 100శాతం స్టార్ట్‌అప్‌లలో 95శాతం విఫలం అయ్యే అవకాశం ఉన్నా, నూతన ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముందన్నారు. అందుకే ప్రభుత్వం ఇన్నోవేషన్ రంగానికి నిరంతరం సహకారం అందిస్తూనే ఉండాలన్నారు.ఈ దిశగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంకుబేటర్ టి.. హబ్ నిర్మాణంతోపాటు అనేక ఇతర కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ద్వారా బడి పిల్లల వయసు నుంచే ఇన్నోవేషన్ పైన అవగాహన కల్పించడం, టాలెంట్ ఉన్న విద్యార్థులకు సహకారం అందించే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్ రంగాన్ని బలోపేతం చేసేందుకు తాము చేపట్టిన ప్రయత్నాలు, ఇప్పటికే ఫలితాలు ఇవ్వడం ప్రారంభమయ్యాయన్నారు, హైదరబాద్ కేంద్రంగా వేదికగా స్టార్ట్ అప్స్ అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్ స్టార్టప్లకు రాజధానిగా మారుతుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు.

Hyundai huge investment of Rs 1400 crore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News