Thursday, January 23, 2025

మార్కెట్‌లోకి సరికొత్త హ్యుందాయ్‌ ఐ20..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్‌కు సరికొత్త ఐ20ని పరిచయం చేసింది హ్యుందాయ్‌ సంస్థ. 1.2 లీటర్ల ఇంజిన్‌ కలిగిన మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ మాడల్‌ రూ.6.99 లక్షల నుంచి రూ.9.97 లక్షల లోపు, ఐవీటీ మాడల్‌ రూ.9.37 లక్షల నుంచి రూ.11.01 లక్షల లోపు ధరను నిర్ణయించింది. 26 స్టాండర్డ్‌ భద్రత ఫీచర్స్‌తో రూపొందించిన ఈ మాడల్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ అసిస్ట్‌ కంట్రోల్‌, యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ డిస్ట్రిబ్యూషన్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయని కంపెనీ సీవోవో తరుణ్‌ గార్గ్‌ తెలిపారు.

వీటితోపాటు ఎమర్జెన్సీ స్టాప్‌ సిగ్నల్‌, రియర్‌ పార్కింగ్‌ కెమెరా, టైర్‌ ప్రెషర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, హెడ్‌ల్యాంప్‌, ఆటోమేటిక్‌ హెడ్‌ల్యాంప్స్‌ వంటివివున్నాయన్నారు. ఈ కారుపై మూడేం డ్లు లేదా లక్ష కిలోమీటర్ల వ్యారెంటీని కల్పిస్తున్నది. ఈ వ్యారెంటనీ పెంచుకునే అవకాశాన్ని కొనుగోలుదారులకు సంస్థ కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News