Wednesday, December 25, 2024

ఎప్పుడూ కెప్టెన్‌లానే ఆలోచిస్తా: విరాట్ కోహ్లి

- Advertisement -
- Advertisement -

ముంబై: కెప్టెన్సీకి సంబంధించి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు లీడర్‌గా కొనసాగేందుకు కెప్టెన్సీ అవసరం లేదని స్పష్టం చేశాడు. జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగినా.. తన ఆలోచనలన్నీ సారథి మాదిరిగానే ఉంటాయన్నాడు. ఈ విషయంలో తనకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే ఆదర్శమన్నాడు. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా అతని సలహాలు, సూచనలు ఎప్పుడూ జట్టుకు ఉపయుక్తంగా ఉండేవన్నాడు. అతని సలహాలను తాను తప్పక పాటించేవాడినని కోహ్లి వివరించాడు. మహి భాయ్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నా జట్టులో అతని స్థాయి తగ్గలేదన్నాడు. జట్టులో కొనసాగినంత కాలం అతని సలహాలు తీసుకునే వాళ్లమని పేర్కొన్నాడు. ఇక తాను మూడు ఫార్మాట్‌ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నా కెప్టెన్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటానన్నాడు. జట్టు వ్యూహాల్లో తప్పక పాలుపంచుకుంటానని కోహ్లి స్పష్టం చేశాడు.

I always thinking like a Captain: Kohli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News