Thursday, January 23, 2025

నేను పామునే, కానీ… : మోడీ

- Advertisement -
- Advertisement -

కోలార్(కర్నాటక): ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనను ‘విష సర్పం’ అనడంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిస్పందించారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న కర్నాటకలోని కోలార్‌లో ఆయన బిజెపికి ప్రచారం చేస్తూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. తాను ప్రధాని అయినప్పటి నుంచి ఆ పార్టీ తనను ద్వేషిస్తోందని అన్నారు.

కోలార్‌లో ఆయన ప్రసంగిస్తూ‘ అవినీతిని కూకటి వేళ్లతో పీకేయాలని మా పార్టీ ప్రయత్నిస్తోంది. కానీ కాంగ్రెస్‌కు ఇది గిట్టడం లేదు. పైగా వారు నన్ను విష సర్పం అని పేర్కొన్నారు. నేడు మీకో మాట చెప్పనివ్వండి, భగవంతుడైన ఈశ్వరుడి మెడలో పాముంటుంది. వారికి పామునైన నేను మీ మధ్య ఉన్నాను. కర్నాటక ప్రజలు మే 13న కాంగ్రెస్ తగు బుద్ధి చెబుతారు’ అన్నారు.

‘కాంగ్రెస్ 85 శాతం కమిషన్ తీసుకునే పార్టీ. వారు కర్నాటకలో మళ్లీ అధికారంలోకి వచ్చి లూటీ చేయాలనుకుంటున్నారు. అయితే ప్రజలు జాగురుకులై ఉన్న కారణంగా అది జరగదు. కోలార్ ప్రజలు కాంగ్రెస్‌కు, జెడి(ఎస్)కు నిద్రలేని రాత్రులను ఇవ్వబోతున్నారు’ అని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఈ మీటింగ్ తర్వాత చన్నపట్నలో మరో పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు. ఆదివారం మైసూరులో ఆయన రోడ్ షో చేయనున్నారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లిపోనున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనున్నాయి. ఫలితాలు మే 13న ప్రకటితమవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News