Wednesday, January 22, 2025

తొలి సినిమా టాలీవుడ్ లోనే చేశాను: అనిల్ కపూర్

- Advertisement -
- Advertisement -

‘యానిమల్’ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నారు. యానిమల్ సినిమా డిసెంబర్ 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ తెలుగులోనే మాట్లాడాడు. అందరూ బాగున్నారా.. ట్రైలర్ చూశారా… నచ్చిందా అని అభిమానులను అడిగారు. తెలుగు ఇండస్ట్రీతోనే సినిమాల్లోకి వచ్చానని, బాపు దర్శకత్వంలో తన తొలి సినిమా ‘వంశవృక్షం’లో నటించానని వివరణ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ యానిమల్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చానని చెప్పాడు. లేటుగా వచ్చిన కూడా లేటెస్ట్‌గా వచ్చానని, ఇప్పుడు తనకు స్సెషల్ ఫీలింగ్ ఇస్తుందన్నారు. చిత్ర యూనిట్‌కు థ్యాంక్స్ చెప్పడంతో పాటు దిల్ రాజుకు ఐ లవ్ రాజ్ అనడం అనిల్ కపూర్ మాటలు ఆసక్తిని కలిగించాయి. ఈ వేడుకకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి, సినిమా నటులు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News