Monday, December 23, 2024

పూనమ్ పాండే బతికే ఉందా? (వీడియో)

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. సర్వైకల్ కాన్సర్ తో పూనమ్ మరణించిందన్న వార్తలను ఆమె అభిమానులు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. కాన్సర్ తో బాధపడుతుంటే మూడు రోజుల క్రితం ఆమె ఒక ఫంక్షన్ కి ఎలా హాజరయ్యారని వారు ప్రశ్నిస్తున్నారు. పూనమ్ మృతిపై ఆరా తీసేందుకు కాన్పూర్ లోని ఆమె ఇంటికి వెళ్లిన విలేఖరులకు ఇల్లు తాళం వేసి ఉండటం కనిపించింది. రెండు రోజులుగా ఆమె ఇంటికి  ఎవరూ రావడం లేదనీ, పూనమ్ మరణించినట్లు తమకు మీడియా ద్వారానే తెలిసిందనీ ఇంటి చుట్టుపక్కలవారు చెబుతున్నారు. పైగా పూనమ్ మృతదేహం ఎక్కడుందో, అంత్యక్రియలు జరిగాయో లేదో కూడా ఎవరికీ తెలియట్లేదు.

పూనమ్ పాండేకి బాడీగార్డ్ గా పనిచేసిన అమీన్ ఖాన్ కూడా ఈ విషయంలో గందరగోళంగానే ఉన్నాడు. తమ మేడమ్ మరణించిందంటే నమ్మలేకపోతున్నానని విలేఖరులతో అన్నాడు. ఆమె చాలా ఆరోగ్యంగా ఉండేవారనీ, కాన్సర్ తో బాధపడుతున్నట్లు తనకు తెలియదనీ చెప్పాడు. మేడమ్ మరణించినట్లు తనకు మీడియా ద్వారానే తెలిసిందనీ, పూనమ్ సోదరికి ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని వచ్చిందనీ అతను తెలిపాడు. పూనమ్ కి పుణేలోనూ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో కూడా ప్రస్తుతం ఎవరూ లేరని తెలుస్తోంది.

పూనమ్ శుక్రవారం నాడు చనిపోయిందంటూ ఆమె సోదరి స్వయంగా మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అంతకు మూడు రోజుల ముందు పూనమ్ స్వయంగా ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందులో బ్లాక్ అండ్ వైట్ దుస్తులలో పూనమ్ ఒక పార్టీకి హాజరవుతున్నట్లుగా ఉంది. కాన్సర్ తో బాధపడే వ్యక్తి ఇంత హుషారుగా పార్టీకి వెళ్లడం సాధ్యమేనా అని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

పూనమ్ పాండే మరణవార్తను ఫేక్ అని కొట్టిపారేస్తున్నవారూ లేకపోలేదు. నటుడు కమాల్ఆర్ ఖాన్ పూనమ్ మృతి వార్త అబద్ధమని చెబుతున్నారు. మూడు రోజుల క్రితం ఒక పార్టీకి వెళ్లిన పూనమ్ కాన్సర్ తో మరణించడం నమ్మశక్యంగా లేదని ఆయన అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News