Saturday, December 21, 2024

హైకమాండ్ ఆదేశిస్తే సిఎం పదవికి సై..

- Advertisement -
- Advertisement -

ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్‌లో అందరూ సిఎం అభ్యర్థులే…ఇప్పటికే పలువురు తామే సిఎం అభ్యర్థులమని అదును చూసి ప్రకటించుకుంటున్నారు. ఇదే కోవలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా చేరారు. గతంలో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు రేవంత్‌రెడ్డి సైతం అధిష్టానం ఆదేశిస్తే సీతక్క కూడా సిఎం కావచ్చని చెప్పి… ఆ పార్టీలో సీతక్క పేరును,  సిఎం రేసులో ఆమె పేరును చేర్చారు. దీంతో సీతక్క కూడా ఇదే మాటను గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు.

తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తే ఒక ఎస్సీ, ఎస్టీ, ఒక మహిళ, ఓసీ అభ్యర్థి సిఎం అవుతారని, పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే సిఎం పదవిని చేపడుతానని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8 సీట్లు గెలుస్తామని, 50 వేల ఓట్ల మెజార్టీతో తాను గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తన బలం, బలహీనత దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలన్నారు. నిరుద్యోగ యువత అంతా తనకు అనుకూలంగా ఉన్నారని, ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News