Monday, December 23, 2024

నేను కార్మికుల పక్షమే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఆర్‌టిసి ఉద్యోగులు రాజ్‌భవన్‌ను ముట్టడించడంతో వారి ఆందోళనలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. రాజ్‌భవన్ బయట ఉన్న 10 మంది టిఎంయూ ప్రతినిధుల బృందంతో వెంటనే గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకుల బృందాన్ని రాజ్‌భవన్‌లో కి ఆమె ఆహ్వానించారు. ప్రస్తుతం గవర్నర్ పుదుచ్చేరిలో ఉండగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూ నియన్ నాయకులతో చర్చలు నిర్వహించారు. టి ఎంయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.ఆర్.రెడ్డి, థా మస్‌రెడ్డి బృందం తమిళిసైతో గంటకు పైగా చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ వారితో మాట్లాడుతూ ఆర్టీసి కార్మికుల సమ్మె తనను ఎంతో బాధించిందన్నారు. ఈ సమ్మె వల్ల ప్రజలు ఇబ్బం ది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎ ప్పుడూ కార్మికుల పక్షమేనని ఆమె పేర్కొన్నారు. గతంలో స మ్మె చేసినప్పుడు కార్మికులకు అండగా ఉన్నానని ఆమె గు ర్తు చేశారు. కార్మికుల ప్రయోజనాల కోసమే బిల్లును క్షు ణ్ణంగా పరిశీలిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించా రు.43,373 మంది ఉద్యోగుల భవిష్యత్ గురించి ఆమె ఆం దోళన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే వారి ప్రయోజనాలను ఎల్లప్పుడూ పరిరక్షిస్తామని వారికి ఆమె హామీ ఇ చ్చారు. ప్రభుత్వం తన ప్రశ్నలకు స్పష్టత ఇవ్వకముందే ఆ ర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె గురించి తెలిసి బాధపడ్డానన్నారు. ఈ సమ్మె వల్ల ఉద్యోగులపై ఒత్తిడితో పాటు సామా న్య ప్రజానీకానికి అసౌకర్యం కలిగిందన్నారు. గతంలో ఆ ర్టీసి ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు రాత్రి 11 గంటల వరకు వారి సమస్యలను విన్నానని ఆమె తెలిపారు. ఈ బిల్లును ఆపడంతో వ్యక్తిగత లేదా ఇతర రాజకీయ ప్రయోజనాలు లేవని ఆమె వారితో తెలిపారు.
5 అంశాల్లో స్పష్టతపై ప్రభుత్వానికి లేఖ రాశా
ఇప్పుడు కూడా తాను మీ అందరితో ఉన్నానని, విస్తృత ప్ర జా ప్రయోజనాల దృష్ట్యా ఆర్టీసి ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాలను పరిరక్షించడమే తన ఏకైక ధ్యేయమని గవర్నర్ వారితో పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీలు, ఈపీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలపై ఆందోళన చెందుతున్నట్లు గవర్నర్ ఉద్యోగులకు తెలియజేశారు.రిటైర్డ్ ఉద్యోగులంతా ఇ బ్బందులు పడుతూ వినతిపత్రాలు పంపుతున్నారని ఆమె తెలిపారు. తీసుకున్నకోట్లాది ఉద్యోగుల సంక్షేమ సహకారసం ఘం సొమ్మును ప్రభుత్వం ఇంకా తిరిగి ఇవ్వలేదని, నిజంగా కార్మికులకు మేలు జరిగితే వారికి పూర్తిగా అనుకూలంగా ఉం టాన ని, భవిష్యత్‌లో ఉ ద్యోగుల ప్రయోజనాలు పూర్తిగా పరిరక్షించాలని కోరుకుంటున్నానన్నారు.ఆర్టీసి ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బిల్లులోని 5అంశాలపై స్పష్టత కోరుతూ రాజ్ భవన్ ప్రభుత్వానికి లేఖ రాసిందనిఆమె పేర్కొన్నారు.
బిల్లును క్షుణ్ణంగా అధ్యయనం చేయాలనే…
ఈ బిల్లును అకారణంగా ప్రవేశపెట్టరాదని, నిబంధనలపై స మగ్రంగా చర్చించేందుకు సంబంధిత పార్టీలకు తగినంత సమ యం ఇవ్వాలన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వానికి లేఖ రాశానన్నారు. ఒక రాజ్యాంగ అధిపతిగా, రాజ్యాంగ నిబంధనలను ధ్రువీకరించి, ప్రజలతో పాటు ఉద్యోగుల విస్తృత ప్రయోజనాలను ప రిరక్షించాలన్న ఉద్ధేశ్యంతో 5 అంశాలపై న్యాయ సలహా, వివరణను కోరినట్టు తెలిపారు. ఉద్యోగులు, సంబంధిత పక్షాల బిల్లు ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి నిబంధనలను మరింత పరిశీలనలో చూడాలన్న ఉద్ధేశ్యంతో అలా వ్యవహారించాల్సి వచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News