Monday, December 23, 2024

హరితహారం మొక్కలు నాటడం నా అదృష్టం

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : హరితహారం మొక్కలు నాటడం అదృష్టంగా భావిస్తున్నానని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ హరితోత్సవంలో భాగంగా సోమవారం ప్రభుత్వ గురుకుల బాలికల కళాశాల ప్రాంగణంలో ఎమ్మెల్యే మెచ్చా మొక్కలు నాటారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యేశాలువాతో సత్కరించి అభినందించారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శాలువాతో సత్కరించి అభినందించారు.

అనంతరం రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచే విధంగా విద్యను బోధిస్తున్న కళాశాల ప్రధానోపాధ్యాయులును ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మన కళాశాలలో హరితహరం మొక్కలు నాటడం అదృష్టంగా భావిస్తున్నానని, మన వారసులకు, రానున్న తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్ఛమైన గాలిని, నివాస యోగ్యమైన ప్రకృతి పరిసరాలను అందించాలనే గొప్ప సంకల్పం హరితహారానికి ఉందని, ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు చూపు రానున్న తరాలు ఆనందంగా జీవించాలనే హరితహారంను ప్రారంభించారని, ఈరోజు మనం ఎటు చూసిన తెలంగాణ పచ్చగా కనిపిస్తుందంటే అది ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనేనని, మొక్కలు నాటే విషయంలో విద్యార్థులు కూడా చురుకుగా పాల్గొని మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకోవాలని సూచించారు.

రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తు విద్యార్థులు చదవడం చాలా సంతోషంగా ఉందని, అందరూ బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగినరోజు మనం చదివిన కళాశాలను, ఉపాధ్యాయులను మరిచిపోకూడదనీ, ఎలాంటి సహకారం కావాలన్నా అందుబాటులో ఉంటానని, ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపిపి దారా మల్లికార్జున్ రావు, ఎంపిటిసి సోడెం లక్ష్మి, సర్పంచ్ లావణ్య భరత్, అర్లపెంట సర్పంచ్ వంక ముత్యాల రావు, కొయ్యల అచ్యుత్ రావు, రాయల నాగేశ్వరరావు, ప్రభాకర్, రమేష్, రెడ్డిమల్ల నాగయ్య, ఎండిఓ నాగేశ్వరరావు, ఎంఆర్వో సిహెచ్ స్వామి, ఎఫ్‌డిఓ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News