Monday, December 23, 2024

ఆరోగ్యంగానే ఉన్నా: పోప్ ఫ్రాన్సిస్

- Advertisement -
- Advertisement -

రోమ్ : తాను ఆరోగ్యంగాను ఉన్నానని, ఆదివారం యధావిధిగా భక్తులను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తానని క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. శ్వాస సంబంధ సమస్యలతో రోమ్ లోని జెమెల్లీ ఆస్పత్రిలో చేరిన ఆయన తాజాగా డిశ్చార్జి అయ్యారు. శనివారం సాయంత్రం తిరిగి వాటికన్ సిటీకి బయలుదేరారు. శ్వాస, ఊపిరితిత్తుల సమస్యలతో బుధవారం పోప్ ఫ్రాన్సిస్ రోమ్ లోని జెమెల్లీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆస్పత్రి నుంచి కారు లోకి ఎక్కేంత వరకు చేతికర్ర సాయంతో ఆయనే నడిచి వచ్చారు. ఆస్పత్రి ఎదుట తనకోసం వేచి ఉన్న క్రైస్తవ భక్తులు, మీడియా ప్రతినిధులతో కాసేపు మాట్లాడారు. కారులోకి ఎక్కే ముందు కుమార్తెను కోల్పోయి ఆస్పత్రిలో రోదిస్తున్న ఓ మాతృమూర్తి వద్దకు వెళ్లి పోప్ పరామర్శించారు.మృతురాలి ఆత్మకు శాంతి చేకూరేలా తల్లిదండ్రులతో కలిసి ప్రార్థనలు చేశారు. మోచేయి విరిగిపోయిన ఓ బాలుడ్ని చూస్తూ కారులోంచి చేతులు ఊపుతూ పలకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News