Friday, January 10, 2025

నా కుమారుడు రాహుల్‌ను మీకు ఇస్తున్నా:సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

రాయబరేలి ప్రజలకు తన కుమారుని ఇస్తున్నానని, ‘రాహుల్ మిమ్మల్ని నిరాశ పరచడు’ అని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ శుక్రవారం చెప్పారు. రాయబరేలిలో ఒక సంయుక్త ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన సోనియా 20 ఏళ్ల పాటు ఎంపిగా తమకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ‘మీరు నాకు సర్వస్వం ఇచ్చారు. కనుక సోదర సోదరీమణుల్లారా! నా కుమారుని మీకు ఇస్తున్నాను. మీ మనిషిగా నన్ను మీరు పరిగణిస్తున్నారు’ అని ఆమె చెప్పారు. వోటర్లలో భావోద్వేగాన్ని సోనియా పంచుకుంటూ, రాహుల్ గాంధీని తమ సొంత మనిషిటా పరిగణించవలసిందని ప్రజలను కోరారు. రాహుల్ మిమ్మల్ని నిరాశ పరచడని ఆమె అన్నారు. సభ వేదికపై సోనియా పక్కనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిల్చున్నారు. ‘ఇందిరా గాంధీ, రాయబరేలి ప్రజలు నాకు నేర్పిన పాఠాలనే రాహుల్‌కు, ప్రియాంకకు నేర్పాను.

అందరినీ గౌరవించాలని, బలహీనులను కాపాడాలని, ప్రజల హక్కుల కోసం అన్యాయంపై పోరాడాలని నేర్పాను. భయపడకండి. మీ పోరాట మూలాలు, సంప్రదాయాలు ప్రగాఢమైనవి’ అని సోనియా పేర్కొన్నారు. సోనియా గాంధీ మొదటిసారి 2004లో రాయబరేలి నుంచి ఎంపిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన తరువాత ఈ ఏడాది ఆరంభంలో లోక్‌సభ సీటుకు రాజీనామా చేసేంత వరకు ఆమె రాయబరేలికి ప్రాతినిధ్యం వహించారు. రాహుల్ గాంధీ ఈ దఫా రాయబరేలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తనను ఎన్నుకున్నందుకు రాయబరేలి ప్రజలకు సోనియా గాంధీ ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ’20 ఏళ్ల పాటు ఎంపిగా మీకు సేవ చేసేందుకు మీరు నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఇది నా జీవితంలో అతిపెద్ద ఆస్తి’ అని సోనియా చెప్పారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా కాంగ్రెస్, ఎస్‌పి ఇతర సీనియర్ నేతలతో పాటు ర్యాలీలో వేదికపై ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News