న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీకి ఆదివారం బ్రేక్ పడింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఇతర ఆటగాళ్ల గురించి పక్కన పెడితే.. ఢిల్లీ తరఫున అత్యద్భుతంగా బ్యాటింగ్ చేసిన కరణ్ నాయర్ శ్రమ మాత్రం వృధాగా పోయింది. ఈ మ్యాచ్‌లో కరణ్ నాయర్ 40 బంతుల్లో 89 పరుగలు చేశాడు. కానీ, తన జట్టు మాత్రం విజయం సాధించలేకపోయింది. దీంతో కరణ్ ఎంతో నిరుత్సాహ పడ్డానని మ్యాచ్ అనంతరం అన్నాడు.
ఈ మ్యాచ్ అనంతరం కరుణ్ నాయర్ మాట్లాడుతూ.. ‘నా బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాక్కర్లేదు. ఎందుకంటే.. ఇప్పుడు దాని గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. మన జట్టు విజయం సాధించనప్పుడు మనం ఎంత స్కోర్ చేసినా విలువ ఉండదు. ఐపిఎల్‌లో ఆడుతానని ఈ మ్యాచ్‌కి ముందే నాకు తెలుసు, అందుకు సిద్ధంగా ఉన్నాను. క్రీజ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని బావించా. నేను ఆడిన షాట్లు అన్ని నాకు కలిసొచ్చాయి. నా బ్యాటింగ్ పరంగా తృప్తిగానే ఉన్నా. కానీ, మా జట్టు కూడా గెలిచి ఉంటే బాగుండేది’ అని కరుణ్ నాయర్ అన్నాడు.