దమ్మపేట : సమస్యలను పరిష్కరించడానికి నేను నిరంతరం అందుబాటులో ఉంటానని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గురువారం మండల పరిధిలోని లంకాలపల్లి పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు గ్రామస్తులతో సమావేశమై వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సీతారామ కాలువ వల్ల వ్యవసాయానికి వెళ్లే దారి లేక అవస్థలు పడుతున్నామని, రైతులు సమస్యను తెలిపారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఐబి శాఖ అధికారి సురేష్‌కు ఫోన్ చేసి సీతారామ ప్రాజెక్టుపై వంతెన ఏర్పాట్లు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈఈని కోరారు. వెంటనే స్పందించిన ఆయన వంతెన ఏర్పాటు చేయటానికి అంచనా వేసి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కొన్ని రోజుల క్రితం కిడ్నీ సంబంధిత బాధపడుతున్న రామోజీ అనే మహిళ స్థానిక జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు సకాలంలో స్పందించి వారికి వైద్యం చేయించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి ఇంటికి వద్దకు వెళ్లి ఆమెను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, కొయ్యల అచ్యుతరావు, సోడియం గంగరాజు, కాక భరత్, వెంకటేశ్వర్లు, కాకా అశోక్ తదితర నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.