Monday, December 23, 2024

ఆ ఇద్దరికి రుణ పడి ఉంటా: రిషబ్ పంత్

- Advertisement -
- Advertisement -

స్టార్ ఇండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ సోమవారం కారు ప్రమాదానికి గురై తనకు సహాయం చేసిన యువకులు రజత్ కుమార్, నిషు కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపాడు వారి “ఇద్దరిని హీరోలు” అంటూ ట్విట్ చేసాడు. తాను ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పలేకపోవచ్చు, కానీ తనకు ప్రమాదం జరిగినప్పుడు తనకు సహాయం చేసిన ఆ ఇద్దరు యువకులకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను, రుణపడి ఉంటానని పంత్ ట్వీట్ చేశారు.

క్లిష్ట సమయంలో మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. శస్త్ర చికిత్సలు పూర్తయ్యాయి. కోలుకునే ప్రక్రియ ఇప్పుడే మొదలైంది. మున్ముందు ఎదురయ్యే సవాళ్లకు సిద్ధంగా ఉన్నా. నాకు అన్నివిధాల అండగా నిలిచిన బీసీసీఐ, జైషా, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు.. నా కోసం శ్రమిస్తున్న వైద్యులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మైదానంలో కలుద్దాం’ అని పంత్‌ పేర్కొన్నాడు.

గతేడాది డిసెంబర్‌30వ తేదీన ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా పంత్‌ ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదం త‌ర్వాత కారులో మంట‌లు చెల‌రేగాయి. దీంతో అప్రమత్తమైన పంత్‌ వెంటనే కారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ సమయంలో పంత్‌కు రజత్‌, నిషుకుమార్‌లు సాయం చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News