Monday, December 23, 2024

తాటాకు చప్పుళ్లకు భయపడను…

- Advertisement -
- Advertisement -

బిజెపి ప్రవర్తన మార్చుకోపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు
ఉద్దేశపూర్వకంగానే నామినేషన్ వేసే రోజే తనిఖీలు
బిజెపి పార్టీపై నిప్పులు చెరిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, బిజెపి ప్రవర్తన మార్చుకోపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని, ఉద్దేశపూర్వకంగానే నామినేషన్ వేసే రోజే తనిఖీలు జరుపుతున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో మరోసారి ఆదాయపన్ను శాఖ దాడులు కలకలం రేపాయి. ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపి, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేప్టటారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీ తనను ఇబ్బంది పెట్టాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. భారతీయ జనతా పార్టీలోకి రావాలని తనపై ఒత్తిడి చేశారని, ఆ పార్టీలోకి రాలేదన్న దురుద్ధేశ్యంతోనే ఆ పార్టీ తమను ఇబ్బంది పెడుతుందన్నారు. అదేవిధంగా హస్తం పార్టీ గ్రాఫ్ పెరిగిన నేపథ్యంలో బిజెపి పార్టీ నాయకులు ఐటీ శాఖతో తమను ఇబ్బందులు పెట్టాలని పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈసీకి ఫిర్యాదు చేసిన పొంగులేటి
రెండు రోజుల ముందుగానే తాను ఉహించినట్లే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. బిజెపి ఎజెండా ఒక్కటేనని తెలంగాణలో కాంగ్రెస్ గెలవకూడదని ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఉదయం నుంచి సుమారు 30 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారని పొంగులేటి తెలిపారు. చివరకు తనను జైలులో పెట్టినా వెనక్కి తగ్గనని కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు జైలులో ఉండేదుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపన్ని చేస్తున్న దాడులను ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు తన నామినేషన్‌ను అడ్డుకునేందుకు ఐటీ దాడులు చేయిస్తున్నారని పొంగులేటి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పొంగులేటి అనుచరులు, కార్యకర్తలు ఆయన నివాసానికి భారీగా చేరుకొని ఆందోళన చేపట్టారు. తమ నేతపై కావాలనే బిజెపి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని వారు ఆరోపించారు. మరోవైపు నేడు నామినేషన్ వేసేందుకు ఆయన సిద్ధమవుతున్న నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశవుతోంది.
దాడులను ఖండించిన రేవంత్‌రెడ్డి
మరోవైపు కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులను టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ నాయకుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ తనిఖీలు దేనికి సంకేతమని వారు ప్రశ్నించారు. వేరే పార్టీకి చెందిన నేతల ఇళ్లపై ఐటీ సోదాలు ఎందుకు జరగడం లేదు? అని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైందని, ఆ సునామీని ఆపడానికి చేస్తున్న కుతంత్రమే ఇది అని వారు మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News