Wednesday, January 22, 2025

నేను రాలేకపోతున్నా.. అయినా మీరు నా గుండెకు చాలా దగ్గర

- Advertisement -
- Advertisement -
వీడియో సందేశంలో సోనియా

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ కీలక సందేశం ఇచ్చారు. ఆరోగ్య కారణాల రీత్యా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయిన సోనియాగాంధీ వీడియో సందేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఙప్తి చేశారు. ప్రియమైన సోదర సోదరీమణులారా నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా, కానీ, మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారు. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తవ్వడం చూడాలనుకుంటున్నా.. ప్రజల తెలంగాణగా మనమందరం కలిసి మార్చుకోవాలి. మీ కలలు సా కారం అవ్వాలి. మీకు మంచి ప్రభుత్వం లభించాలి. నన్ను సోనియమ్మ అని పిలిచి నాకు చాలా గౌరవం ఇచ్చారు. ఈ ప్రేమ, అభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా ను. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు నా విన్నపం.. మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటేయండి.. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలని వీడియో ద్వారా సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు సందేశమిచ్చారు.
సోనియా సందేశం ప్లస్ అవుతుందని…
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీతో ఫినిషింగ్ టచ్ ఇప్పించాలని టి- కాంగ్రెస్ నేతలు ముందుగానే భావించారు. కానీ, పలు కారణాల రీత్యా సోనియా గాంధీ ప్రచారానికి రాలేకపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియా గాంధీతో వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలకు సందేశం ఇప్పించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం. తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియాకు గుర్తింపు ఉండటంతో ఆమె ఇచ్చిన సందేశం ఎన్నికల వేళ తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News