Monday, December 23, 2024

నేను సంతోషంగా లేను: డికె సురేష్ 

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తాను పూర్తిగా సంతోషంగా లేనని కెపిసిసి ప్రెసిడెంట్ డికె శివ కుమార్ సోదరుడు ఎంపి డికె సురేష్ తెలిపారు. డికె మీడియాతో మాట్లాడారు. మా సోదరుడు సిఎం కావాలని అనుకున్నామన్నారు. కర్నాటక ప్రజలకు తాము చేసి వాగ్ధానాలు నెరవేర్చాల్సి ఉంటుందన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పార్టీ ప్రయోజనాల కోసం తన నాయకత్వం చెప్పిన ఫార్ములాకి అంగీకరిస్తున్నామన్నారు. కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డికె శివ కుమార్ చెరో రెండున్నర సంవత్సరాలు కొనసాగనున్నారు.  మే 20న సిద్ధ రామయ్య ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే శివ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ నివాసానికి సిద్ధరామయ్య, డికె శివ కుమార్ చేరుకున్నారు. కెసి వేణుగోపాల్‌తో చర్చల అనంతరం రాహుల్ గాంధీని సిద్ధరామయ్య, డికె శివ కుమార్ కలువనున్నారు.

Also Read: డిఎఒలో టాప్ 3 ర్యాంకర్స్ అరెస్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News