Thursday, January 23, 2025

రేవ్ పార్టీలో నేను లేను: హీరో శ్రీకాంత్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరు జరిగిన రేవ్ పార్టీలో తాను లేను అని హీరో శ్రీకాంత్ తెలిపాడు. రేవ్ పార్టీలో హీరో శ్రీకాంత్ ఉన్నాడని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన స్పందించారు. రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని తాను కాదు అని, త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండని, బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన‌ అత‌నెవ‌రో కానీ, కొంచెం తనలాగే ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. అత‌డికి కాస్త గ‌డ్డం ఉండడంతో పాటు ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడని, తనలాగే ఉండడంతో తానే షాక్ గురయ్యానని చెప్పారు. తాను హైద‌రాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నానని మీడియా ముందుకు వచ్చి శ్రీకాంత్ వివరణ ఇచ్చుకున్నాడు. రేవ్ పార్టీలో దొరికిన వ్యక్తి హీరో శ్రీకాంత్ లాగానే ఉన్నాడని తాము కూడా షాక్ గురయ్యామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆదివారం రాత్రి బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటి సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుతున్న సమయంలో పోలీసుల దాడి చేసి వంద మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టైన వారిలో టాలీవుడ్ నటులు ఉన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News