Monday, December 23, 2024

నేను బిజెపిలో చేరడం లేదు: కమల్‌నాథ్‌

- Advertisement -
- Advertisement -

తాను బిజెపి పార్టీలో చేరడం లేదని సీనియర్ కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తెలిపారు. గత రెండు మూడు రోజులుగా కమల్ నాథ్.. బిజెపిలో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ మారడంపై కమల్ నాథ్ స్పందించారు. తాను బిజెపిలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, కాంగ్రెస్ లోనే కొనసాగుతానని వెల్లడించారు.

సోమవారం కమల్ నాథ్ ఢిల్లీలో..ఎఐసిసి చీప్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను బిజెపిలో చేరుతున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News