Friday, December 27, 2024

నేను కాంగ్రెస్‌ను వీడడం లేదు: అద్దంకి దయాకర్

- Advertisement -
- Advertisement -

నేను కాంగ్రెస్‌ను వీడడం లేదు
కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు

మనతెలంగాణ/హైదరాబాద్ : నేను కాంగ్రెస్ వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. తాను పార్టీ మారడం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వీడియోను రిలీజ్ చేసిన ఆయన తాను పార్టీ మారుతున్నట్లు చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు.

కొన్ని పార్టీల వారు చేస్తున్న కుట్రలో భాగంగానే తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానం తనకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. తుంగతుర్తి విషయం, ఇతర విషయాల్లో పార్టీ ఎప్పుడూ తనకు పార్టీ వ్యతిరేకంగా లేదన్నారు. తాను పార్టీలో కొనసాగుతున్నానని చెప్పడానికి ఈ వీడియోను చేయడం లేదని పార్టీని, అద్దంకి దయాకర్‌ను బద్నాం చేసేందుకు వేరే పార్టీ వాళ్లు ఇంతకు దిగజారారని చెప్పడానికి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానన్నారు. పార్టీలో అందరినీ కలుపుకుపోయేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో అందరూ సంయమనంతో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తనకే బి- ఫాం రాబోతుందని తుంగతుర్తిలో నామినేషన్ కూడా వేయబోతున్నట్లు ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News