Sunday, December 22, 2024

సిఎం సవాల్‌కు నేను సిద్ధం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /సంగారెడ్డి బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది తొండి రాజకీయమని, ఆయన చేసిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీష్ రావు స్పష్టం చేశారు. సంగారెడ్డిలో బుధవారం బిఆర్‌ఎస్ జహీరాబా అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నామినేషన్ కా ర్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…‘ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నా ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేస్తా.. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను..నాకు పదవులు ముఖ్యం కాదు’ అని అన్నారు.

‘రైతు రుణమాఫీ, ఇచ్చిన హామీలు చేయకపోతే నువ్వు.. సిఎం పదవికి రాజీనామా చేస్తావా? శుక్రవారం అమరుల స్థూపం వద్దకు చర్చకు సిద్ధమా? చర్చకు సిఎం రేవంత్ కూడా రావాలి’ అని ప్రతి సవాల్ చేశా రు. ‘కాంగ్రెస్ అమలు చేయాల్సిన 8 ప్రధాన హామీలను అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా.. అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి.. ఆగస్టు 14 అర్ధరాత్రి వరకు మీకు గడువు’ అని అన్నారు. రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడే చేస్తామన్నారు.

ఇంకా చేయలేదని, కనీసం దానికి సంబంధించిన విధివిధానాలు కూడా తయారు చేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ కొత్త డేట్ పెడుతున్నారని, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేయనందు రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ ఎంపి అభ్యర్థి గాలి అనిల్ కుమార్, జడ్‌పి చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, పార్టీ నేతలు రాజేందర్ జయపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News