Monday, March 31, 2025

అవయవ దానానికి సిద్ధం : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

అవయ దానానికి తాను సిద్ధంగా ఉన్నానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ఆయన ముందుకు వచ్చారు. శాసనసభలో అవయవదానం బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై జరిగిన చర్చలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవయవ దానానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు. నియోజకవర్గాల్లోనూ అవయవదానంపై చైతన్యం తేవాలని చెప్పారు. ప్రజలకు అవయవదానంపై అవగాహన కల్పించాలని తెలిపారు. సభ్యులు ముందుకు వస్తే అసెంబ్లీలోనే సంతకాలు చేద్దామన్నారు. అవయవదానంపై మెుదటి సంతకం తానే చేస్తానని వెల్లడించారు. అవయవదానం గొప్ప మానవీయ చర్య అని, మరింత మందికి జీవితాన్నిస్తుందని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News