Tuesday, January 21, 2025

జైలు కెళ్లడానికి నేనైతే రెడీ: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రేవంత్ రెడ్డి నన్ను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలనుకుంటే తాను అందుకు రెడీ అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘‘రెండు, మూడు నెలలు జైల్లో ఉంటే ఏమవుతుంది? మంచిగా యోగా చేసుకుని బయటకు వస్తా…ఆ తర్వాత పాదయాత్రకు సిద్ధమవుతా’’ అంటూ చెప్పుకొచ్చారు.

‘‘నా పై లక్ష్యం కాదు…ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. ఏసిబి నుంచి నాకు ఎలాంటి నోటీసు అందలేదు. నాకు న్యూస్ పేపర్ల నోటీసులే వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడేది లేదు. విచారణకు గవర్నర్ అనుమతిస్తే… అది ఆయన విచక్షణకు వదిలేస్తా. రాజ్ భవన్ వేదికగా బిజెపి, కాంగ్రెస్ ములాఖత్ బయటపడింది. అవి బిఆర్ఎస్ ను తుడిచేయాలనుకుంటున్నాయి’’ అని కెటిఆర్ వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News