Monday, January 20, 2025

అభ్యర్థులను డిసైడ్ చేసేది నేనే! : మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మేడ్చల్ నియోజకవర్గంలో ఏ పార్టీలో ఏ అభ్యర్థి ఉండాలో డిసైడ్ చేసేది తానేనని మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో గురువారం  మీడియాతో చిట్ చాట్ చేసిన మంత్రి… మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్లపై స్పందించారు. ఏ పార్టీలో ఎవరు అభ్యర్ధి ఉండాలో తానే నిర్ణయిస్తానన్నారు. గత ఎన్నికల్లో కెఎల్ ఆర్‌కు కాంగ్రెస్ టికెట్ ఇప్పించిందే తానని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. త్వరలో కాంగ్రెస్‌లో కూడా ఎవరు పోటీ చేయాలో నేనే చెప్తా .. కాంగ్రెస్ అధిష్టానంలో తనకు స్నేహితులు ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డిపై తొడగొట్టిన తర్వాత తన గ్రాఫ్ పెరిగిందన్నారు. కావాలనే కొంత మంది తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే మీడియా సంస్థ ఏర్పాటు చేస్తా. తెలంగాణ యాసలో ఏడాదికి 4 సినిమాలు తీస్తానని మంత్రి మల్లా రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బిజెపిలకు డబుల్ బెడ్ రూమ్ అంశం తప్ప మాట్లాడేందుకు మరొకటి లేదని మల్లారెడ్డి అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News