- Advertisement -
పాటియాలా: తాను కేవలం నిజాలు మాత్రమే మాట్లాడగలనని, అబద్ధపు వాగ్దానాలను వినాలనుకుంటే ప్రధాని నరేంద్రమోడీ, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రసంగాలను వినవలసి ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఆయన మంగళవారం పాటియాలా జిల్లా రాజ్‌పురలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. నూతన ఆలోచనలు, నవ పంజాబ్ పేరుతో ఈ సభ జరిగింది. పంజాబ్ ప్రమాదం నుంచి బయటపడాలంటే ప్రతిఒక్కరూ సమైక్యంగా నడవాలని సూచించారు. రాహుల్ సోమవారం ఓ సభలో మాట్లాడుతూ శాసన సభ ఎన్నికల్లో ప్రయోగాలు చేయవద్దని ఓటర్లను కోరారు. సరిహద్దుల్లో ఉన్న పంజాబ్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొనడం తప్పనిసరి అని పేర్కొన్నారు. కేవలం కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రంలో ప్రశాంతతను కాపాడగలదని చెప్పారు.
I can only speak truth say Rahul Gandhi
- Advertisement -