Monday, December 23, 2024

శ్రీకృష్ణునికి నేనొక గోపికగా భావిస్తుంటాను : హేమమాలిని

- Advertisement -
- Advertisement -

మధుర : భగవాన్ శ్రీకృష్ణునికి తానొక గోపికగా భావించుకుంటానని సినిమా నటీమణి, రాజకీయ నేత హేమమాలిని తన మనసులోని మాట బయటపెట్టారు. మధుర లోక్‌సభ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థినిగా ఆమె మూడోసారి పోటీ చేస్తున్నారు. పేరు కోసమో, కీర్తి కోసమో లేక ఏదైనా ప్రయోజనం ఆశించో తాను రాజకీయాల్లో చేరలేదని అన్నారు. బ్రిజ్వాసిస్‌లను భగవాన్ శ్రీక్రిష్ణుడు ప్రేమిస్తాడని, వారికి తాను నమ్మకంగా సేవ చేస్తున్నందున తనపై కూడా క్రిష్ణుని ప్రేమానురాగాలు ఉంటాయని విశ్వాసం వెలిబుచ్చారు.

మధుర లోని బ్రిజ్వాసిస్‌లకు సేవ చేయడానికి తనకు మళ్లీ అవకాశం ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. బ్రాజ్ 84 కోస్ పరిక్రమ చాలా దుస్థితిలో ఉందని, దీని అభివృద్ధి చేయడానికే ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. బ్రాజ్ కోస్ పరిక్రమ అన్నది కృష్ణ భగవానుని శాశ్వత స్థలంగా పరిగణిస్తారు. ఇందులో అడవులు, ఉద్యానవనాలు, చెరువులు ఉంటాయి. టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణగా దీనిని తీర్చిదిద్దుతానని హేమమాలిని స్పష్టం చేశారు. దీని నవీకరణ కోసం తన అభ్యర్థనపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ రూ. 5000 కోట్లు మంజూరు చేశారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News