Sunday, January 5, 2025

నేనెక్కడికీ పారిపోలేదు నా డెన్‌లోనే ఉన్నా:రామ్‌గోపాల్‌వర్మ

- Advertisement -
- Advertisement -

తన మీద ఒకేసారి వివిధ జిల్లాల్లో కేసులు నమోదవడం చూస్తుంటే కుట్ర జరుగుతున్నట్లుగా కనిపిస్తోందని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అనుమానం వ్యక్తం చేశారు. తనపై కుట్ర జరుగుతుందనిపించడం వల్లే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన 22 పాయింట్లతో ఎక్స్ వేదికగా సుదీర్ఘ ట్వీట్ చేశారు. తాను ఎవరినీ నిందించడం లేదు కానీ నా వెనుక ఏదో జరుగుతోందని మాత్రం అర్థమవుతోందన్నారు. నా కేసు-ఆర్జీవీ అంటూ చేసిన ఈ ట్వీట్‌లో తనపై నమోదైన కేసులు, సెక్షన్లను వివరిస్తూ అది తనకు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. అలాగే ప్రచారం జరుగుతున్నట్లుగా తాను ఎక్కడికీ పారిపోలేదన్నారు. నా డెన్‌లోనే ఉన్నానని తెలిపారు. పోలీసులు కూడా తనను అరెస్ట్ చేయడానికి రాలేదని వెల్లడించారు. అర్జీవీ చేసిన వరుస ట్వీట్‌లు చేశారు. ‘నేనేదో పరారీలో ఉన్నాను, మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఈ టైమ్ అంతా నేను నా డెన్ ఆఫీసులోనే ఉన్నాను. అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకు వెళ్లాను’ అని ట్వీట్ చేశారు.

‘పోలీసులు ఇప్పటి వరకు నా ఆఫీసులోకి కాలు కూడా పెట్టలేదు. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒకవేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసులోకి ఎందుకు రారు?’ అని ట్వీట్‌లో ప్రశ్నించారు. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే నలుగురు వేర్వేరు వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు వేర్వేరు జిల్లాల్లో నా మీద ఈ కేసు పెట్టారు. ఇంకా మీడి యా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదయ్యాయి. అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు. ఇవన్నీ కూడా కేవలం గత 4, 5 రోజుల్లోనే నమోద య్యాయ’ని మరో ట్వీట్‌లో వివరించారు. ‘నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాను. చాలాసార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని. ఒక సంవత్సర కాలంలో కొన్ని వేల పోస్టులు చేసి ఉంటాను. వాళ్ళు నేను పెట్టానంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రంకు సంబంధిం చినవి. ఆ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం ఆ చిత్రం విడుదల అవ్వడం కూడ చాలా నెలల క్రితం జరిగి పోయింద’ని వెల్లడించారు.

‘నేను పెట్టిన ఏ పోస్టుల వల్ల వేర్వేరు ప్రాంతాల్లో మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నార’న్నారు. ‘ఇప్పటికీ మీడియాలో వస్తున్న కథనాలు నన్ను పట్టుకోవటానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారని వాళ్ళు ముంబై, చెన్నై ఇంకా పలుచోట్ల వెతుకు తున్నారని నేను పరారీలో ఉన్నానని. కానీ ఇవన్నీ అబద్ధాలు. ఈ మీడియా ప్రతిసారి లాగే హైడ్రామా క్రియేట్ చేసింద’ని పేర్కొన్నారు. ‘నేను చట్టాన్ని గౌరవిస్తాను. అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలును కచ్చితంగా పాటిస్తాను. కాని దాంతో పాటు రాజ్యాంగ పరిధిలో చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కును వినియోగించుకుంటాను. ఎప్పటి లాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకుని అందులో నన్ను సెంట్రల్ కేరక్టర్‌గా చేసి ఒక సినిమా తీసింది. నాకు కూడా వాళ్ళకున్నంత టాలెంట్ ఉండి ఉంటే ఎంత బాగుండేదో?’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News