Friday, November 22, 2024

నేను పారిపోలేదు : జెలెన్‌స్కీ

- Advertisement -
- Advertisement -

I did not run away: Zelensky

కీవ్ : తాను పోలాండ్‌కు పారిపోయినట్టు రష్యన్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిల్ జెలెన్‌స్కీ శనివారం తిప్పికొట్టారు. తాను కీవ్ లోనే తన కార్యాలయంలో ఉన్నానని తెలిపారు. ఓ అధికారితో కలిసి తన కార్యాలయంలో ఉన్నట్టు కనిపించే విధంగా ఓ వీడియోను విడుదల చేశారు. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన విడుదల చేసిన రెండో వీడియో ఇది. రష్యాకు చెందిన రాజకీయ నేత వ్యచెస్లావ్ వోలోడిన్ మీడియాతో మాట్లాడుతూ జెలెన్‌స్కీ పోలాండ్ పారిపోయారని, ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యులకు జెలెన్‌స్కీ అందుబాటులో లేరని తెలిపారు. రష్యా దళాల దాడులు తీవ్రం కావడంతో ఉక్రెయిన్ పార్లమెంటు రహస్య సమావేశానికి ముందే జెలెన్‌స్కీ పారిపోయారని ఆరోపించారు. అలాగే ఫిబ్రవరి 24 న ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం ప్రకటించిన వెంటనే జెలెన్‌స్కీ పరారయ్యారని వదంతులు వ్యాపించాయి ఈ ప్రచారాన్ని జెలెన్‌స్కీ తిప్పి కొడుతూ ఫిబ్రవరి 26 న ఓ సెల్ఫీ వీడియాను విడుదల చేశారు. సురక్షితంగా తరలిస్తామని అమెరికా ఇచ్చిన ఆఫర్‌ను కూడాఆయన తిరస్కరించారు. తనను వేరొక చోటుకు తీసుకెళ్లడం కాదని, తనకు ఆయుధాలు కావాలని చెప్పారు.

నాటో ప్రకటనపై మండిపాటు

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) పై జెలెన్‌స్కీ మండిపడ్డారు. ఉక్రెయిన్‌పై నోఫ్లై జోన్‌ను ప్రకటించాలని తాను చేసిన విజ్ఞప్తిని నాటో తోసిపుచ్చడం తమ దేశంపై మరిన్ని బాంబు దాడులకు అవకాశం ఇవ్వడమేనని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ టెలివైజ్డ్ ప్రసంగాన్ని విడుదల చేశారు. నాటో నిర్ణయం వల్ల ఉక్రెయిన్ నగరాలు, గ్రామాలపై మరిన్ని బాంబులు వేసే విధంగా రష్యాకు పచ్చ జెండా ఊపినట్టయిందని పేర్కొన్నారు. నాటో సదస్సు జరిగినా అది చాలా బలహానమైన సమావేశమని, అయోమయంతో కూడిన సమావేశమని మండి పడ్డారు. యూరపు స్వేచ్ఛ మొదటి లక్షం అనే వషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని , అలా జరగడం లేదనే విషయం స్పష్టమైందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News