Monday, December 23, 2024

నేను చనిపోలేదు

- Advertisement -
- Advertisement -

నటి పూనం పాండే సంచలనం

న్యూఢిల్లీ : నటి పూనమ్ పాండే చనిపోలేదు. తాను చనిపోలేదు. బతికే ఉన్నానని ఈ నటి శనివారం స్వ యంగా ప్రకటించారు. సర్వైకల్ క్యాన్సర్‌పై ప్రజలకు అవగావహన కల్పించేందుకే తాను ఈ చావు స్టంటుకు దిగినట్లు పూనమ్ ఓ వీడియో వెలు వరించింది. పలు హాట్‌హాట్ సినిమాలలో నటించి, అనేక రకాల కవ్వింపు ప్రకటనలతో సంచలనాత్మక నటిగా మారిన పూనమ్ గర్భాశయ క్యాన్సర్‌తో మృతి చెందినట్లు శుక్రవారం వెలువడ్డ వార్తలు ఫ్యాన్స్‌లో క లవరానికి దారితీశాయి. సోషల్ మీడియా అంతా పూనమ్ విషాదాంతం ఉదంతంతో మార్మోగింది. అ యితే రోజు గడిచిన తరువాత ఆమె మరణ వార్త పూ ర్తిగా కట్టుకథ అని వెల్లడైంది. ఓ సామాజిక చైతన్యం కోసం, ప్రత్యేకించి సర్వైకల్ క్యాన్సర్ పట్ల జనంలో అవగావహనకు తాను యత్నించినట్లు, చావు వార్త ఇందులో భాగమే అని ఆమె తెలిపారు. ఈ చర్యపై సామాజిక మాధ్యమంలో జనం మండిపడ్డారు. కేవ లం పబ్లిసిటికి ఈ విధంగా ఆమె జనంతో డ్రామాకు దిగిందని కామెంట్లు వెలువడ్డాయి. నిజమే , సర్వైకల్ క్యాన్సర్ ప్రాణాంతకమే అయితే సరైన జాగ్రత్తలు తీ సుకుంటే ఈ క్యాన్సర్ ఏమి చేయలేదని తెలియచే సేందుకు తాను ఈ ప్రచారానికి దిగినట్లు శనివారం ఈ నటి తెలిపారు. తనను ఈ క్యాన్సర్ ఓడించలేదని ధీమా వ్యక్తం చేశారు. సరైన అవగాహన లేకపోవ డం, సామాజిక కట్టుబాట్లు , భయాలతో వేలాది మం ది మహిళలు ఈ జబ్బుకు బలి అయ్యారని ఆమె ఆ వేదన వ్యక్తం చేశారు. ఈ క్యాన్సర్ వల్ల మనం చా వడం కాదు. మన చైతన్యంతో ఈ క్యాన్సర్ చచ్చేలా చేద్దాం అని ఆమె ఆ వీడియోలో పిలుపు నిచ్చారు. ఈ విధంగా ప్రజలలో , ప్రత్యేకించి అభిమానులలో కలవ రం , మాధ్యమాలలో కలకలం రేకెత్తేలా చేసినందుకు చింతిస్తున్నానని తెలిపారు. ఏదో సెస్సెన్షన్‌తోనే ఇటువంటి వాటిపై జనం ఆలోచించేలా చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ స్టంటుకు దిగానని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు బాలికలకు పెద్ద ఎత్తున టీకాల కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. మరుసటిరోజే పూనమ్ ఈ క్యాన్సర్ ఈ క్యాన్సర్‌తో మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు ఇది నిజం కాదని ఆమె ద్వారానే తెలిసి ఫ్యాన్స్ సంతోషించారు. అయితే ఇదేం వేలంవెర్రి అని పలువురు తిట్టిపోశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News