- Advertisement -
హైదరాబాద్: గత కొంతకాలంగా ఎమ్మెల్యే రాజాసింగ్.. కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పుకార్లకు బండి చెక్ పెట్టారు. రాజాసింగ్‌తో తనకు ఎలాంటి విబేధాలు లేవని బండి స్పష్టం చేశారు. హిందుసమాజ సంఘటితం కోసం పోరాడే నేత రాజాసింగ్ అంటూ ఆయన కొనియాడారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి బండి ఆకాశ్‌పురిలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తామంతా ఒక్కటే అని.. తమ మధ్య విబేధాలు లేవని పేర్కొన్నారు. హెచ్‌సియు భూముల బ్రోకర్ ఎవరో కెటిఆర్ బయటపెట్టాలని అన్నారు. అవినీతి ఆధారాలు బయటపెట్టే దమ్ము కెటిఆర్‌కు లేదా అని ప్రశ్నించారు.
- Advertisement -