Monday, November 18, 2024

హరీష్ రావుకు దేవాదాయ శాఖ ఇస్తాం: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలని తాము అనుకోవడం లేదని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాము తలచుకుంటే బిఆర్‌ఎస్ వాళ్ల లాగా చేయగలం కానీ తాము చేయడంలేదన్నారు. అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులు, కెఆర్‌ఎంబి సంబంధిత అంశాలపై సభలో చర్చ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడారు.  అవినీతి సొమ్ముతో ప్రతిపక్షం లేకుండా చేయాలని తాము అనుకోవడంలేదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని తాము అనుకోవడంలేదని, బిఆర్‌ఎస్ ధ్వంసం చేసిన వ్యవస్థలను దారిలో పెడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. హరీష్ రావు కష్టించి పని చేస్తారు కానీ ఏం లాభం అని అడిగారు. హరీష్ రావు మంత్రి అయినా నిర్ణయాలన్నీ కెసిఆర్‌వేనని ఎద్దేవా చేశారు. హరీష్ రావు, కెసిఆర్, కెటిఆర్ మాటలు ఆనడం ఆపి పాలక పక్షం మాటలు వినాలని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. హరీష్ రావు కాంగ్రెస్‌లోకి వస్తే తీసుకుంటామని, హరీష్ రావు 25 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో రావాలని, బిఆర్‌ఎస్‌లో ఉన్న హరీష్‌కు ప్రయోజనం లేదని, ఆయనకు దేవాదాయ శాఖ ఇస్తామన్నారు. బిఆర్‌ఎస్‌లో చేసిన పాపాలు కడుక్కోవడానికి దేవదాయ శాఖ ఇస్తామని రాజగోపాల్ రెడ్డి చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకరావాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News